Bigg Boss 9 : బిగ్‏బాస్ గడ్డపై జై జవాన్ నినాదం.. 65 లక్షల ప్రైజ్ మనీతో కళ్యాణ్ పడాల సెన్సేషనల్ విక్టరీ!

బిగ్‏బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా ముగిసింది. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలకు, ఉత్కంఠకు తెరదించుతూ ఈ సీజన్ విజేతగా కళ్యాణ్ పడాల నిలిచాడు.

Update: 2025-12-22 05:14 GMT

Bigg Boss 9 : బిగ్‏బాస్ గడ్డపై జై జవాన్ నినాదం.. 65 లక్షల ప్రైజ్ మనీతో కళ్యాణ్ పడాల సెన్సేషనల్ విక్టరీ!

Bigg Boss 9 : బిగ్‏బాస్ తెలుగు సీజన్ 9 గ్రాండ్ ఫినాలే అట్టహాసంగా ముగిసింది. గత వారం రోజులుగా సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చలకు, ఉత్కంఠకు తెరదించుతూ ఈ సీజన్ విజేతగా కళ్యాణ్ పడాల నిలిచాడు. బిగ్‏బాస్ చరిత్రలోనే ఒక సరికొత్త రికార్డు నమోదైంది. సెలబ్రిటీల ఇలాకాలో ఒక సామాన్యుడు (కామనర్) అడుగుపెట్టి, అందరినీ దాటుకుని టైటిల్ కైవసం చేసుకోవడం విశేషం. చివరి నిమిషం వరకు తనూజ, కళ్యాణ్ మధ్య పోరు హోరాహోరీగా సాగినప్పటికీ, స్వల్ప ఓట్ల తేడాతో కళ్యాణ్ విజేతగా నిలిచి ట్రోఫీని ముద్దాడాడు. తనూజ రన్నరప్‌గా నిలిచింది.

విజయనగరం జిల్లాకు చెందిన కళ్యాణ్ పడాల నేపథ్యం చాలా ఆసక్తికరం. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన కళ్యాణ్, తన కష్టంతో సీఆర్పీఎఫ్ జవాన్గా ఉద్యోగం సంపాదించాడు. దేశ సరిహద్దుల్లో మూడేళ్లపాటు సైనికుడిగా సేవలు అందించాడు. అయితే చిన్నప్పటి నుంచి నటనపై ఉన్న మక్కువతో, అగ్నిపరీక్ష అనే ప్రోగ్రాం ద్వారా బిగ్‏బాస్ హౌస్ లోకి కామనర్ కోటాలో ఎంట్రీ ఇచ్చాడు. వేలాది మందిని దాటుకుని హౌస్ లోకి వచ్చిన మొదటి కామనర్ కళ్యాణ్ కావడం గమనార్హం.

మొదటి మూడు వారాలు కళ్యాణ్ ఆట తీరు చూసిన ఆడియన్స్ చాలా నిరాశ చెందారు. హౌస్ లో సరిగ్గా మాట్లాడలేక, టాస్కుల్లో యాక్టివ్ గా ఉండలేక తన ఉనికిని కోల్పోతున్నాడని అందరూ భావించారు. కానీ, మూడో వారంలో తన స్నేహితురాలు ప్రియ ఎలిమినేట్ అయిన తర్వాత కళ్యాణ్ గేర్ మార్చాడు. అక్కడి నుంచి తన అసలు సిసలు ఆటను బయటకు తీశాడు. వ్యూహాలు మార్చుకుంటూ, అద్భుతమైన మాట తీరుతో జెన్యూన్ ప్లేయర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రతి టాస్కులోనూ ప్రాణం పెట్టి ఆడుతూ, విన్నర్ రేసులో మొదటి నుంచి దూసుకుపోతున్న సెలబ్రిటీ కంటెస్టెంట్ తనూజకే చెమటలు పట్టించాడు. ఫ్యామిలీ వీక్ సమయానికి కళ్యాణ్ గ్రాఫ్ ఆకాశానికి చేరింది. అదే ఊపులో సీజన్ చివరి కెప్టెన్‌గా, ఫస్ట్ ఫైనలిస్ట్‌గా నిలిచి రికార్డ్ సృష్టించాడు.

ఇక కళ్యాణ్ గెలుచుకున్న బహుమతుల విషయానికి వస్తే.. విన్నర్‌గా అతడికి రూ. 35 లక్షల ప్రైజ్ మనీ లభించింది. వాస్తవానికి ప్రైజ్ మనీ రూ.50 లక్షలు కాగా, ఫినాలే రేసులో డీమాన్ పవన్ రూ.15 లక్షల సూట్ కేసు తీసుకుని తప్పుకోవడంతో అది రూ.35 లక్షలకు తగ్గింది. వీటితో పాటు కళ్యాణ్‌కు వారానికి రూ.2 లక్షల చొప్పున 15 వారాలకు గానూ రూ.30 లక్షల రెమ్యునరేషన్ అందినట్లు సమాచారం. అంటే మొత్తం కలిపి దాదాపు రూ.65 లక్షలు అతడి ఖాతాలోకి చేరాయి. వీటితో పాటు అదనంగా ఒక మారుతీ సుజుకీ విక్టోరిస్ కారు కూడా బహుమతిగా అందుకున్నాడు. ఒక సామాన్యుడు ఆర్మీ నుంచి వచ్చి బిగ్‏బాస్ విజేతగా నిలవడంతో ఫ్యాన్స్ జై జవాన్ అంటూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.

Tags:    

Similar News