Car Accident : డ్రింక్ అండ్ డ్రైవ్ అటాక్.. మృత్యువు అంచుదాకా వెళ్లి వచ్చిన బాలీవుడ్ బ్యూటీ
బాలీవుడ్ డ్యాన్సింగ్ సెన్సేషన్, నటి నోరా ఫతేహి అభిమానులను ఒక్కసారిగా ఆందోళనకు గురిచేసే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. ముంబై నగరంలో నోరా ప్రయాణిస్తున్న కారు ఘోర ప్రమాదానికి గురైంది.
Car Accident : డ్రింక్ అండ్ డ్రైవ్ అటాక్.. మృత్యువు అంచుదాకా వెళ్లి వచ్చిన బాలీవుడ్ బ్యూటీ
Car Accident : బాలీవుడ్ డ్యాన్సింగ్ సెన్సేషన్, నటి నోరా ఫతేహి అభిమానులను ఒక్కసారిగా ఆందోళనకు గురిచేసే వార్త ఒకటి వెలుగులోకి వచ్చింది. ముంబై నగరంలో నోరా ప్రయాణిస్తున్న కారు ఘోర ప్రమాదానికి గురైంది. పట్టపగలు మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఒక వ్యక్తి మద్యం మత్తులో కారు నడుపుతూ వచ్చి, నోరా ప్రయాణిస్తున్న వాహనాన్ని బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో నోరాకు స్వల్ప గాయాలైనట్లు సమాచారం. అదృష్టవశాత్తు ఆమె ప్రాణాపాయం నుంచి తృటిలో తప్పించుకున్నారు.
ప్రమాదం జరిగిన వెంటనే నోరా ఫతేహిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. కారు బలంగా ఢీకొనడంతో లోపల ఎక్కడైనా రక్తస్రావం జరిగిందేమోనన్న అనుమానంతో వైద్యులు ఆమెకు CT స్కాన్ కూడా నిర్వహించారు. అన్ని పరీక్షలు పూర్తయ్యాక, ఆమెకు ఎటువంటి పెద్ద గాయాలు కాలేదని వైద్యులు నిర్ధారించారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆమె ఒక ప్రైవేట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఈ హఠాత్పరిణామంతో నోరా తీవ్రమైన షాక్‌కు గురయ్యారు.
ప్రమాదం తర్వాత ఆమె ఆరోగ్యంపై వస్తున్న వార్తలపై స్వయంగా నోరా స్పందించారు. "నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, సురక్షితంగా ఉన్నాను" అని చెప్పి అభిమానుల ఆందోళనను దూరం చేశారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ఆమె తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. "డ్రింక్ అండ్ డ్రైవ్ చేయకండి.. అది మీ ప్రాణాలకే కాదు, ఇతరుల ప్రాణాలకు కూడా ముప్పు" అని ఆమె చెప్పారు. వైద్యులు కొద్దిరోజులు విశ్రాంతి తీసుకోమని సూచించినప్పటికీ, ఆమె తన వృత్తి పట్ల ఉన్న నిబద్ధతతో ముందుగా ఒప్పుకున్న షూటింగ్‌లో పాల్గొనడం విశేషం.
కెనడాకు చెందిన 33 ఏళ్ల నోరా ఫతేహి, బాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం నటిగానే కాకుండా, ఇంటర్నేషనల్ లెవల్‌లో గొప్ప డ్యాన్సర్‌గా ఆమెకు మంచి క్రేజ్ ఉంది. ప్రస్తుతం పలు సినిమాలు, ప్రైవేట్ ఆల్బమ్స్, యాడ్స్‌తో ఆమె బిజీగా గడుపుతున్నారు. సుమారు 80 కోట్ల రూపాయల ఆస్తిని కలిగిన నోరా, ఈ ప్రమాదం నుంచి క్షేమంగా బయటపడటంతో ఆమె అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.