The Raja Saab Teaser: ‘రాజా సాబ్’ టీజర్ వచ్చేసింది..!
The Raja Saab Teaser: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ హారర్ చిత్రం ‘ది రాజా సాబ్’.
The Raja Saab Teaser: ‘రాజా సాబ్’ టీజర్ వచ్చేసింది..!
The Raja Saab Teaser: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా, మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రొమాంటిక్ కామెడీ హారర్ చిత్రం ‘ది రాజా సాబ్’. ఈ సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ఈ సినిమాకి సంబంధించి టీజర్‌ను చిత్రబృందం తాజాగా విడుదల చేసింది.
టీజర్‌లో ప్రభాస్ వింటేజ్ లుక్‌లో కనిపిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. హారర్ ఎలిమెంట్స్, ఫన్నీ డైలాగులు, ఆకట్టుకునే విజువల్స్‌తో టీజర్ ఆసక్తిని రేపుతోంది. డిఫరెంట్ జానర్‌లో వస్తున్న ప్రభాస్ మూవీగా ఇప్పటికే మంచి బజ్ సొంతం చేసుకున్న ‘ది రాజా సాబ్’ పై ఈ టీజర్ మరింత అంచనాలు పెంచేసింది. మీరూ ఈ టీజర్‌ని మిస్ అవకండి!