Prabhas: సీఎం జగన్‌కు ప్రభాస్ కృతజ్ఞతలు..
Prabhas Thanks CM Jagan: ఏపీ ప్రభుత్వం టాలీవుడ్‌కు గుడ్ న్యూస్ చెప్పింది.
Prabhas: సీఎం జగన్‌కు ప్రభాస్ కృతజ్ఞతలు..
Prabhas Thanks CM Jagan: ఏపీ ప్రభుత్వం టాలీవుడ్‌కు గుడ్ న్యూస్ చెప్పింది. సినిమా టికెట్ ధరలపై చాన్నాళ్లుగా నెలకొన్న సందిగ్ధతకు తెరదించుతూ సినిమా టికెట్ ధరలపై కొత్త జీవో జారీ చేసింది. ఏపీలోని సినిమా థియేటర్లలో టికెట్ల ధరలను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల సినీ ఇండస్ట్రీ హర్షం వ్యక్తం చేస్తోంది. తాజాగా సీఎం జగన్, మంత్రి పేర్నినానికి ధన్యవాదాలు తెలుపుతూ హీరో ప్రభాస్ ట్వీట్ చేశారు. తెలుగు సినీ వర్గాల ఆందోళనలు అర్ధం చేసుకుని సవరించిన టికెట్ ధరలతో టాలీవుడ్ ఇండస్ట్రీని ఆదుకున్నారని తెలిపారు.
టికెట్ల ధరల పెంపుపై మెగాస్టార్ చిరంజీవి కూడా ట్విట్టర్‌లో స్పందించారు. ప్రజలకు వినోదం అందుబాటులో ఉండాలనే సంకల్పాన్ని దృష్టిలో ఉంచుకుని సినిమా టికెట్ల రేట్లను సవరించినందుకు ఏపీ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. చిన్న సినిమాలకు ఐదో షోకి అనుమతినివ్వడం నిర్మాతలకు మేలు చేస్తుందన్నారు.