Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ప్రభాస్ స్పిరిట్ షూటింగ్ డేట్ ఫిక్స్

Prabhas: డార్లింగ్ ప్రభాస్ సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. ఆయన తదుపరి సినిమా ది రాజా సాబ్ విడుదల తేదీ ఇప్పటికే రెండు సార్లు మారింది. ఈ ఏడాదే ది రాజా సాబ్ రిలీజ్ కానుంది.

Update: 2025-07-29 10:05 GMT

Prabhas: డార్లింగ్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. ప్రభాస్ స్పిరిట్ షూటింగ్ డేట్ ఫిక్స్

Prabhas: డార్లింగ్ ప్రభాస్ సినిమా వచ్చి చాలా కాలం అయ్యింది. ఆయన తదుపరి సినిమా ది రాజా సాబ్ విడుదల తేదీ ఇప్పటికే రెండు సార్లు మారింది. ఈ ఏడాదే ది రాజా సాబ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే ది రాజా సాబ్ షూటింగ్ పూర్తి చేసుకున్న ప్రభాస్, 'ఫౌజీ' సినిమా షూటింగ్ కూడా దాదాపుగా ముగించారు. ఇప్పుడు ప్రభాస్ నటిస్తున్న మరో సినిమా షూటింగ్ డేట్ బయటకొచ్చింది. తన అవుట్-ఆఫ్-ది-బాక్స్ సినిమాలతో పేరుగాంచిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ నటించబోతున్నాడు. ఈ సినిమాకి స్పిరిట్ అనే పేరు పెట్టారు. ఇప్పటికే సినిమా పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది. సందీప్ వంగ సినిమా షూటింగ్‌కు అంతా సిద్ధం చేసుకున్నారు. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో సినిమా షూటింగ్ ఎప్పటి నుంచి మొదలవుతుందో చెప్పారు.

విజయ్ దేవరకొండ నటించిన కింగ్‌డమ్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఒక పాడ్‌కాస్ట్‌లో సందీప్ రెడ్డి వంగ మాట్లాడుతూ.. స్పిరిట్ సినిమా షూటింగ్‌ను సెప్టెంబర్ నెలలో ప్రారంభిస్తున్నామని స్పష్టం చేశారు. అంతేకాదు, సినిమా షూటింగ్ మొత్తాన్ని ఒకే స్ట్రెచ్‌లో పూర్తి చేయబోతున్నారట. అంటే, దాదాపు నాలుగైదు నెలల్లోనే సందీప్ రెడ్డి వంగ ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేస్తారు.

ఈ సినిమాకు మొదట దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటించాల్సి ఉంది. కానీ సందీప్ రెడ్డి వంగతో కొన్ని అభిప్రాయభేదాల కారణంగా దీపిక ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారు. ఆమె స్థానంలో బాలీవుడ్ నటి తృప్తి డిమ్రిని సందీప్ రెడ్డి వంగ ఎంపిక చేసుకున్నారు. ఈ సినిమా కథ ఒక నిజాయితీ గల పోలీస్ అధికారి చుట్టూ తిరుగుతుందట. ఆ పోలీస్ అధికారి తన నిజాయితీ కారణంగా ఉద్యోగం కోల్పోవడం, ఆ తర్వాత తన కుటుంబాన్ని కూడా కోల్పోవడం చివరికి విదేశాల్లో ఉండి తనకు హాని చేసిన విలన్‌ను వెతికి చంపడం వంటి కథాంశం ఈ సినిమాలో ఉంటుందని సమాచారం.


ప్రస్తుతం ప్రభాస్ చేతిలో చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. ది రాజా సాబ్ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌లో విడుదల కానుంది. తదుపరి ఏడాది ఫౌజీ సినిమా థియేటర్లలోకి రానుంది. ఆ తర్వాత స్పిరిట్ సినిమా విడుదల కాబోతోంది. స్పిరిట్ షూటింగ్ పూర్తయిన తర్వాత ప్రభాస్ సలార్ 2 సినిమాలో పాల్గొంటారు. ఆపై కల్కి 2898 AD సినిమా షూటింగ్ మొదలవుతుంది. మొత్తం మీద, ప్రభాస్ వరుస సినిమాలతో బిజీగా ఉండటం అభిమానులకు పండగే.

Tags:    

Similar News