గతేడాది సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్.. బాహుబలి లాంటి భారీ సక్సెస్ తర్వాత ప్రభాస్ మూవీ కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో పెరిగాయి. కానీ సినిమా అనుకున్నంత సక్సెస్ కాకపోయినప్పటికీ భారీగానే వసూళ్ళను సాధించింది. ఇక ఈ సినిమా తరవాత ప్రభాస్ యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నారు. ఈ సినిమాలో పూజా హేగ్దే హీరోయిన్ గా నటిస్తోంది. సినిమా ఎప్పుడో మొదలైనప్పటికి ఫ్యాన్స్ కి ఎలాంటి అప్డేట్స్ అయితే లేవు...
ప్రేక్షకులు ఈ సినిమా అప్డేట్స్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా చిత్ర యూనిట్ తాజా అప్‌డేట్‌ను అభిమానులతో పంచుకుంది. ఓ క్రేజీ ఛేజింగ్ సీన్‌లో ప్రభాస్ పాల్గొన్న దృశ్యాలను షూట్ చేసినట్టు ట్విట్టర్ లో పేర్కొంది. అంతేకాకుండా అంతర్జాతీయ ప్రొఫెషనల్స్ సహకారంతో ఈ సీన్‌ను తెరకెక్కించామని, ఇక యూరప్‌లో భారీ షెడ్యూల్‌ను ప్లాన్ చేశామని, మరిన్ని అప్‌డేట్స్ త్వరలో వెల్లడిస్తామని పేర్కొంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ 20 రోజుల షెడ్యూల్ కోసం జార్జియా బయలుదేరింది. మార్చి 15 నుంచి 20 రోజుల పాటు జార్జియాలో కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తారు.
A cute chase sequence with a terrific international crew has been completed. A long schedule in Europe awaits now. More updates soon! #Prabhas20
— UV Creations (@UV_Creations) March 10, 2020
పూర్వజన్మల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారని తెలుస్తోంది. ఇందులో కాజల్ ఓ ప్రముఖ పాత్రలో కనిపించనుందని సమాచారం.. సినిమాని దీపావళి సందర్భంగా విడుదల చేయనున్నారు. సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.
ఇక ఈ సినిమా అనంతరం ప్రభాస్ మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ సినిమాని వైజయంతి మూవీస్ భారీ బడ్జెట్ తో నిర్మించనుంది. ఈ సినిమాని డిసెంబర్ లో సెట్స్ పైకి తీసుకువెళ్లనున్నారు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ గ్రాప్ లో సినిమా ఉంటుందని తెలుస్తోంది! సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలియనున్నాయి.