Pooja Hegde: ఒకప్పుడు గోల్డెన్ లెగ్.. ఇప్పుడు ఐరన్ లెగ్.. పూజా హెగ్డే కెరీర్లో ఏమైందంటే?
Pooja Hegde: ఒకప్పుడు హీరోయిన్ పూజా హెగ్డే సినిమా అంటే అది తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ప్రేక్షకులకు ఉండేది.
Pooja Hegde: ఒకప్పుడు గోల్డెన్ లెగ్.. ఇప్పుడు ఐరన్ లెగ్.. పూజా హెగ్డే కెరీర్లో ఏమైందంటే?
Pooja Hegde: ఒకప్పుడు హీరోయిన్ పూజా హెగ్డే సినిమా అంటే అది తప్పకుండా హిట్ అవుతుందనే నమ్మకం ప్రేక్షకులకు ఉండేది. ఆమె మంచి స్క్రిప్ట్‌లు ఎంచుకుంటుందని, ఆమె గ్లామర్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని ఫ్యాన్స్ భావించేవారు. కానీ, ఇప్పుడు పూజా హెగ్డే దశ తిరిగింది. ఆమె ముట్టుకున్నదంతా ప్లాప్‌గా మారుతోంది. ఆమె నటించిన సినిమాలు వరుసగా విఫలమవుతున్నాయి. .
వరుసగా ప్లాప్‌లు..
పూజా హెగ్డే 2012లో తమిళ చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు. ఆ తర్వాత తెలుగు, హిందీ సినిమాలు చేశారు. 2017-19 మధ్యకాలంలో టాలీవుడ్‌లో పూర్తిగా బిజీ అయిపోయారు. 2020లో విడుదలైన అల వైకుంఠపురములో సినిమా పెద్ద హిట్ అయింది. కానీ, 2021 నుంచి ఆమెకు అదృష్టం కలసి రాలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ప్లాప్ అయింది. ఆ తర్వాత ప్రభాస్‌తో నటించిన రాధేశ్యామ్ కూడా ప్లాప్‌గా నిలిచింది. బీస్ట్, సర్కస్, దేవ, రెట్రో వంటి సినిమాలు కూడా విజయం సాధించలేకపోయాయి.
స్పెషల్ సాంగ్స్ కూడా..
ఇటీవలి కాలంలో పూజా హెగ్డే స్పెషల్ సాంగ్స్ లో కూడా కనిపిస్తున్నారు. ఆమె కూలి సినిమాలో మోనికా అనే పాటలో కనిపించారు. కానీ ఈ సినిమాకు కూడా మిశ్రమ స్పందన వచ్చింది. పూజా హెగ్డే ఉండటం వల్లే సినిమా ప్లాప్ అయిందని కొందరు విమర్శించినా, ఆమె అభిమానులు మాత్రం దీన్ని ఒప్పుకోవడం లేదు.
మోనికా పాటలో పూజా హెగ్డే అద్భుతమైన స్టెప్పులు వేశారు. ఆమె త్వరలో రాబోయే జన నాయగన్ సినిమాలో కూడా కథానాయికగా నటిస్తున్నారు. ఈ సినిమాలో దళపతి విజయ్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా విజయ్ చివరి సినిమా అని చెబుతున్నారు. ఒకవేళ అది నిజమైతే, ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలి. అయితే, పూజా హెగ్డే ఉండటంతో ఈ సినిమా కూడా ప్లాప్ అవుతుందేమోనని కొందరు వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. పూజా హెగ్డే మళ్లీ ఎప్పుడు విజయాల బాట పడతారో చూడాలి.