OG Movie: ‘ఓజీ’ పవర్‌ఫుల్ సాంగ్.. ‘గన్స్ అండ్ రోజెస్’ వచ్చేసింది..!
OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ, ఆయన నటించిన 'ఓజీ' (OG) సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.
OG Movie: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల ఎదురుచూపులకు తెరదించుతూ, ఆయన నటించిన 'ఓజీ' (OG) సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రచార కార్యక్రమాలను చిత్ర బృందం వేగవంతం చేసింది. ఇందులో భాగంగా సోమవారం 'గన్స్ అండ్ రోజెస్' (Guns N Roses) అనే పవర్‌ఫుల్ సాంగ్‌ను విడుదల చేశారు.
గ్యాంగ్‌స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ పాట విడుదల కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. పవన్ కళ్యాణ్ మాస్ ఇమేజ్‌కు తగినట్టుగా ఈ పాటను రూపొందించినట్లు తెలుస్తోంది. 'ఓజీ' సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రభంజనం సృష్టిస్తుందో చూడాలి.