పవన్ కళ్యాణ్ స్టార్ డం ముందు చిరంజీవి కూడా తక్కువేనా?
*చిరంజీవి కంటే ఎక్కువగానే ఉన్న పవన్ కళ్యాణ్ స్టార్ డం
పవన్ కళ్యాణ్ స్టార్ డం ముందు చిరంజీవి కూడా తక్కువేనా?
Tollywood: దశాబ్దం పాటు సినిమాలకి దూరంగా ఉన్న మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యనే "ఖైదీ నంబర్ 150" సినిమాతో ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. ఆ తరువాత చిరు నటించిన "సైరా నరసింహారెడ్డి" మరియు "ఆచార్య" సినిమాలు ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయాయి. మరోవైపు రెండేళ్ల పాటు సినిమాలకి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా ఈ మధ్యనే వకీల్ సాబ్ సినిమాతో ఇండస్ట్రీ కి రియంట్రి ఇచ్చారు. ఆ తర్వాత భీమ్లా నాయక్ అనే సినిమాతో మరొక సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ సినిమా థియేటర్లలో విడుదలైంది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమా కి పాజిటివ్ టాక్ వస్తున్నప్పటికీ మొదటి రోజున ఓపెనింగ్ కలెక్షన్లు మాత్రం కేవలం పరవాలేదు అనిపిస్తున్నాయి.
మరోవైపు "గాడ్ ఫాదర్" ఒక రీమేక్ సినిమా అని, అందుకే ఓపెనింగ్ కలెక్షన్లు తక్కువగా ఉన్నాయని కొందరు చెబుతున్నారు. కానీ అదే లాజిక్ తో చూసినప్పటికీ పవన్ కళ్యాణ్ నటించిన "వకీల్ సాబ్" మరియు "భీమ్లా నాయక్" సినిమాలు కూడా రీమేక్ సినిమాలే కానీ ఆ రెండు సినిమాలకి బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు నుంచి మంచి ఆదరణ లభించింది. ఈ రకంగా చూస్తే చిరంజీవి కంటే పవన్ కళ్యాణ్ స్టార్డం ఎక్కువగా ఉందని చెప్పుకోవాలి. చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఇండస్ట్రీలో ఏర్పరచుకున్నారు. ఇన్నాళ్ల తర్వాత కూడా తన స్టార్ డం ఏమాత్రం తగ్గలేదని పవన్ కళ్యాణ్ మరొకసారి నిరూపించారని చెప్పుకోవచ్చు.