పవన్ కళ్యాణ్ టైటిల్ తో విజయ్ దేవరకొండ సినిమా...

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ మరియు స్టార్ బ్యూటీ సమంత కలిసి ఇప్పుడు ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే...

Update: 2022-05-16 14:30 GMT

పవన్ కళ్యాణ్ టైటిల్ తో విజయ్ దేవరకొండ సినిమా...

Vijay Devarakonda: టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ విజయ్ దేవరకొండ మరియు స్టార్ బ్యూటీ సమంత కలిసి ఇప్పుడు ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. "నిన్ను కోరి" ఫేమ్ శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాకి "ఖుషి" అనే టైటిల్ ను ఖరారు చేసారు. 2001లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు భూమిక హీరోహీరోయిన్లుగా ఎస్.జె.సూర్య దర్శకత్వంలో నటించిన సినిమా "ఖుషి" అప్పట్లో ఒక కల్ట్ క్లాసిక్ గా నిలిచింది.

ఇప్పుడు అదే సినిమా టైటిల్ ని ఈ సినిమాకి పెట్టడం వల్ల మెగా మరియు పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ఈ సినిమా మోసం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు దర్శక నిర్మాతలు. నోట్లో సిగరెట్టు తో స్టైలిష్ అవతారం లో విజయ్ దేవరకొండ కనిపిస్తూ ఉండగా పక్కనే సమంత చీరలో అందంగా కనిపిస్తోంది. వీరిద్దరి లుక్స్ విభిన్నంగా ఉండటంతో సినిమా కథ ఎలా ఉండబోతోంది అని సర్వత్రా ఆసక్తి నెలకొంది.

చాలా వరకూ ఈ సినిమా షూటింగ్ కాశ్మీర్ లో జరుగుతుందని ఈ సినిమా ఆర్మీ బ్యాక్ డ్రాప్ తో నడుస్తుందని సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. మరి ఖుషి వంటి బ్లాక్ బస్టర్ సినిమా టైటిల్ను ఉపయోగిస్తున్న విజయ్ దేవరకొండ, సమంత మరియు శివ నిర్వాణ ప్రేక్షకులను ఎంతవరకూ మెప్పిస్తారో వేచి చూడాల్సి ఉంది. ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 23న థియేటర్లలో తెలుగు, తమిళ్, కన్నడ మరియు మలయాళం భాషల్లో విడుదల కాబోతుంది.

Tags:    

Similar News