Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు టీజర్ ఎప్పుడంటే?
Hari Hara Veera Mallu: పవన్ కల్యాణ్ హీరోగా, క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో వస్తున్న సినిమా 'హరిహర వీరమల్లు'.
పవన్ కళ్యాణ్ (ఫొటో ట్విట్టర్)
Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్‌లో వస్తున్న సినిమా 'హరిహర వీరమల్లు'. పీరియాడికల్ చిత్రంగా రానున్న ఈ సినిమాను ఎ.ఎం.రత్నం సమర్పణలో పాన్ ఇండియా లెవల్లో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్నారు. నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది.
తాజాగా సినిమాకి సంబంధించి ఓ వార్త నెట్టింట్టో హల్ చల్ చేస్తుంది. పవన్ పుట్టినరోజు పురస్కరించుకొని సెప్టెంబర్ 2న 'హరిహర వీరమల్లు' టీజర్‌ను విడుదల చేసే ఆలోచనలో ఉన్నారంట. అలాగే హీరోయిన్ నిధి అగర్వాల్ ఫస్ట్ లుక్ ను ఆమె పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 17న విడుదల చేస్తారంట. మొత్తంమీద 15 రోజుల షూటింగ్ మాత్రమే జరిగింది.
ఇప్పటికే 'హరిహరి వీరమల్లు'కు సంబంధించి విడుదలైన టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంది. దీంతో సినిమాపై అంచనాలు భారీగానే పెంచాయి.
మొఘలులు, కుతుబ్ షాహిల నేపథ్యంగా ఈ సినిమా సాగుతుంది. అర్జున్ రాంపాల్, జాక్వెలైన్ ఫెర్నాండజ్, ఆదిత్య మేనన్ తదితరలు నటిస్తున్నారు. పూజిత పొన్నాడ ప్రత్యేక గీతంలో నటించనుంది. ఎం.ఎం.కీరవాణి సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నారు.