Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమాపై కీలక అప్‌డేట్..
"హరిహర వీరమల్లు" పై దృష్టి పెట్టనున్న పవన్ కళ్యాణ్
Hari Hara Veera Mallu : పవన్ కళ్యాణ్ హరి హర వీరమల్లు సినిమాపై కీలక అప్‌డేట్..
Hari Hara Veera Mallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా ఇప్పుడు తన రాజకీయ పనులతో బిజీగా ఉన్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో జనసేన పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ రాజకీయాల మీదే తన ఫోకస్ మొత్తం పెడుతున్నారు. కానీ మరోవైపు పవన్ కళ్యాణ్ పూర్తి చేయాల్సిన షూటింగ్ పనులు ఇంకా చాలానే ఉన్నాయి. ముఖ్యంగా క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ నటిస్తున్న "హరి హర వీరమల్లు" సినిమా సెట్స్ పైకి వచ్చి ఇప్పటికి చాలా కాలం గడిచింది.
సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది కానీ ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. త్రివిక్రమ్ కూడా "భీమ్లా నాయక్" సినిమాలో తలదూర్చి ఆలస్యం చేయటం వల్ల కూడా "హరిహర వీరమల్లు" వాయిదా పడిందని కొందరు చెబుతున్నారు. చెప్పడానికి మాత్రం "హరిహర వీరమల్లు" ఒక ప్యాన్ ఇండియన్ సినిమా కాబోతోందని దర్శక నిర్మాతలు గొప్పగా చెబుతున్నప్పటికీ మేకింగ్ విషయంలో మాత్రం దీనిపై ఎటువంటి శ్రద్ధ పెట్టడం లేదని చెప్పుకోవచ్చు.
కనీసం చిత్ర యూనిట్ కి కూడా సినిమా ఎప్పుడు మొదలవుతుంది అని క్లారిటీ లేదు. ఇక తాజాగా డైరెక్టర్ క్రిష్ మరియు నిర్మాత ఏ ఏం రత్నం కలిసి సినిమా రెగ్యులర్ షూటింగ్ ను సెప్టెంబర్ నుంచి మొదలు పెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి పవన్ కళ్యాణ్ కొద్దిరోజులు తన రాజకీయ పనులకు పక్కనపెట్టి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.