Pawan Kalyan: కిన్నెర కళాకారుడు మొగలయ్యకు పవన్ కల్యాణ్ ఆర్ధిక సహాయం
Pawan Kalyan: జానపద కళారూపానికి గౌరవంగా రూ. 2 లక్షలు ఆర్ధిక సహాయం ప్రకటన
పవన్ కళ్యాణ్ -కిన్నెర మొగిలయ్య (ఫైల్ ఫోటో )
Pawan Kalyan: కిన్నెర కళాకారుడు మొగులయ్యకు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఆర్ధిక సాయం అందించారు. మొగలయ్య ప్రతిభ, ఆర్ధిక పరిస్థితిపై హెచ్ఎంటీవీలో ప్రసారం చేసిన కథనంపై పవన్ కల్యాణ్ స్పందించారు. కిన్నెరమెట్ల స్వరాన్ని పలికించడంలో మొగిలయ్య ప్రతిభ కనిపిస్తుంది. జానపద కళారూపానికి గౌరవంగా పవన్ కల్యాణ్ స్వయంగా మొగిలయ్యకు సన్మానం చేసి రెండు లక్షల రూపాయలు ఆర్ధిక సహాయాన్ని ప్రకటించారు