పవర్ స్టార్ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్ గిఫ్ట్..వకీల్ సాబ్ న్యూ పోస్టర్‌ రిలీజ్..టీజర్ డేట్ ఫిక్స్

Update: 2021-01-01 09:01 GMT


పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం 'వకీల్ సాబ్ '. న్యూ ఇయర్ఈ  సినిమాకు సంబంధించిన సందర్భంగా డిసెంబర్ 31న రాత్రి వకీల్ సాబ్ సినిమా యూనిట్ పవర్ స్టార్ ఫ్యాన్స్ గుడ్ న్యూస్ చెప్పింది. వకీల్ సాబ్ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్‌ను విడుదల చేసింది. ఇందులో పవన్ రాయల్ ఎన్ ఫీల్డ్ లేటెస్ట్ మోడల్ బుల్లెట్ నడుపుతుండగా... వెనుక శృతిహాసన్ నవ్వుతూ కనిపించింది. పవన్, శృతిహాసన్ నవ్వుతూ కనిపించారు.

ఈ సందర్భంగా వకీల్ సాబ్ యూనిట్ మరో గుడ్‌న్యూస్ ప్రకటించింది. సంక్రాంతి పండగ సందర్భంగా వకీల్ సాబ్ టీజర్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. దీంతో పవన్ అభిమానులు దీని కోసం ఎదురుచూస్తున్నారు. తాజా పోస్టర్ చూస్తుంటే పవన్, శృతిహాసన్ మధ్య రోమాన్స్ సీన్లు ఉంటాయని తెలుస్తోంది. మరోసారి ఈ జోడీ ప్రేక్షకులను అలరించనుందని తెలుస్తోంది.

ఈ చిత్రంలో అంజలి, నివేదా థామస్, అనన్య ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. థమన్ స్వరాలు అందిస్తున్నాడు. ఈ సినిమాను దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా రూపొందిస్తున్నారు. ఈ సినిమా విడుదలపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుంది. అజ్ఞాతవాసి సినిమా తర్వత వస్తున్న వకీల్ సాబ్ పై పవన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఎలాగైనా హిట్ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాడు. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా 100 కోట్లకు పైగానే జరుగుతుంది. పవన్ రీ ఎంట్రీ సినిమా కావడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.


Tags:    

Similar News