స్మాల్ డైరెక్టర్లకు భలే గిరాకీ.. ఓటీటీ పుణ్యమా అని అమాంతం పెరిగిన డిమాండ్

Update: 2020-08-21 06:03 GMT

OTTs has become boon for the directors: ఓటీటీ పుణ్యమా అని టాలీవుడ్‌లో చిన్న సినిమాల డైరెక్టర్స్‌కు డిమాండ్ అమాంతం పెరిగిపోయింది. లాక్‌డౌన్, థియేటర్‌ల క్లోజ్‌తో ఓటీటీలో ఒక్క వారంలో 4 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. తక్కువ బడ్జెట్‌తో తక్కువ టైమ్‌లో వరుస బెట్టి సినిమాలు తీస్తున్నారు కొంత మంది డైరెక్టర్స్. ఇండస్ట్రీలో ఓటీటీ ద్వారా వచ్చిన మార్పులపై హెచ్ఎంటీవీ స్సెషల్ స్టోరీ.

చిన్న సినిమాలు, మీడియం సినిమాల డైరెక్టర్స్‌కి గిరాకీ బాగానే పెరిగింది. ఒక్కపుడు తమ సినిమాలు రిలీజ్ చేసుకోవాలంటే నానా తంటాలు పడేవారు. సినిమా రిలీజ్ అయినా కనీసం గుర్తింపు కూడా వచ్చేది కాదు. కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో స్మాల్ ఫిల్మ్ డైరెక్టర్లదే హావా నడుస్తోంది. ఓటీటీ‌లో సినిమాలు రిలీజ్ చేసి తమ సత్తా చాటుతున్నారు. డిఫరెంట్ కాన్సెప్టుతో, తక్కువ బడ్జెట్‌తో, తక్కువ సమయంలో సినిమాలు తీస్తూ పెద్ద డైరెక్టర్లకు సవాల్ విసురుతున్నారు.

సుకుమార్, మారుతి, అనిల్ రావిపూడి, సురేందర్ రెడ్డి, నందిని రెడ్డి, తరుణ్ భాస్కర్, లాంటి అగ్ర దర్శకులు నిర్మాతలుగా, తమ శిష్యులను డైరెక్టర్స్‌గా ఓటీటీ వేదికగా పరిచయం చేస్తున్నారు. ఇక ఇప్పటికే ఓటీటీలో తమ సినిమాలను రిలీజ్ చేసిన కొత్త డైరెక్టర్స్‌కు వెంట వెంటనే ఆఫర్స్ వస్తున్నాయి.


Tags:    

Similar News