టాలీవుడ్ హీరో సంచలన ట్వీట్.. సీఎం జగన్‌పై కుట్ర జరుగుతోందంటూ..

X
Highlights
hero ram pothineni sensational tweet on Jagan: టాలీవుడ్ హీరో రామ్ పోతినేని సంచలన ట్వీట్ చేశాడు. ఏపీ సీఎం...
Arun Chilukuri15 Aug 2020 8:32 AM GMT
hero ram pothineni sensational tweet on Jagan: టాలీవుడ్ హీరో రామ్ పోతినేని సంచలన ట్వీట్ చేశాడు. ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై కుట్ర జరుగుతోందంటూ అంటూ ట్వీట్ చేసి తీవ్ర కలకలం రేపారు."సీఎంను తప్పుగా చూపించడానికి పెద్ద కుట్ర జరుగుతున్నట్టుంది. వైఎస్ జగన్ గారూ, మీ కింద పనిచేసే కొంతమంది మీకు తెలియకుండా చేసే కొన్ని పనుల వల్ల మీ ప్రతిష్ఠకు, మేం మీద పెట్టుకున్న నమ్మకానికి డ్యామేజ్ కలుగుతోంది. అలాంటి వాళ్ల మీద ఓ లుక్కేస్తారని ఆశిస్తున్నాం" అంటూ రామ్ ట్విట్టర్ లో స్పందించారు. అంతేకాదు, "ఏపీ గమనిస్తోంది" అంటూ హ్యాష్ టాగ్ కూడా పెట్టారు. రామ్ చేసిన ఈ ట్వీట్ ఆసక్తికరంగా మారింది. ఎవర్ని ఉద్దేశించి ఈ యంగ్ హీరో ట్వీట్ చేశారన్నది చర్చనీయాంశమైంది.
Web Titlehero ram Pothineni sensational tweets on Jagan
Next Story