Andhra Pradesh: ఏపీలో అమలుకానున్న ఆన్‌లైన్ సినిమా టికెటింగ్ సిస్టమ్

Andhra Pradesh: ఏపీ సినిమాటోగ్రఫీ చట్టసవరణ బిల్లు ఆమోదం

Update: 2021-11-25 08:01 GMT

ఆన్లైన్ సినిమా టిక్కెటింగ్ (ఫైల్ ఇమేజ్)

Andhra Pradesh: ఏపీలో కీలకమైన సినిమాటోగ్రఫీ చట్టసవరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇకపై సినిమా టికెట్ల విక్రయాలు ఆన్‌లైన్‌లోనే జరగనున్నాయి. మరోవైపు బెనిఫిట్ షోలను కూడా ప్రభుత్వం రద్దు చేసింది. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు రోజుకు నాలుగు షోలకు మాత్రమే అనుమతి ఉంటుంది. తాము తీసుకొచ్చిన బిల్లు విధంగా బ్లాక్ టికెట్ల దందాకు చెక్ పెడుతుందని అలాగే ప్రభుత్వానికి పన్ను ఎగవేసేవారి సంఖ్యను కూడా తగ్గిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే నిర్ణీత గడువులోగా జీఎస్టీ, సర్వీస్ ట్యాక్స్ వంటి పన్నులను వసూలు చేయడం మరింత సులభమవుతుందని ప్రభుత్వం బిల్లులో పేర్కొంది.

ఇక ప్రజల్లో సినిమాలకు ఉన్న క్రేజ్‌ను కొందరు సినిమావాళ్లు సొమ్ము చేసుకుంటున్నారని టికెట్ రేట్లను అమాంతం పెంచేస్తుండటంతో పేద, మధ్యతరగతి ప్రజలు వినోదానికి దూరమవుతున్నారని మంత్రి పేర్నినాని అన్నారు. వీటన్నింటినీ అరికట్టాలంటే ఆన్‌లైన్ టికెటింగ్ విధానమే సరైందని ప్రభుత్వం నిర్ణయించి అసెంబ్లీలో బిల్లుపెట్టినట్లు వెల్లడించారు. మరోవైపు ప్రభుత్వ నిర్ణయంపై సినీ డిస్ట్రిబ్యూటర్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ నిర్ణయాల వల్ల ఉపయోగం లేదని డిస్ట్రిబ్యూటర్లు నష్టపోయే అవకాశం ఉందని కొందరు విమర్శిస్తున్నారు. ఆన్‌లైన్‌లో టికెట్స్ అమ్మాలని నిర్మాతలు, ఎగ్జిబిటర్లు ఎప్పటి నుంచో కోరుతున్నారని నిర్మాత అంబికా కృష్ణ చెప్పారు. 

Tags:    

Similar News