OG Movie: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పటి నుంచి అంటే?

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఓజీ’ ఈ దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది.

Update: 2025-08-24 14:30 GMT

OG Movie: పవన్ కల్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. అడ్వాన్స్ బుకింగ్స్ ఎప్పటి నుంచి అంటే?

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా, సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన హై ఓల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఓజీ’ ఈ దసరా కానుకగా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, సాంగ్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. ప్రత్యేకంగా ఫైర్ స్ట్రోమ్ సాంగ్ యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది.

తాజాగా మేకర్స్ మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు. వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 27 ఉదయం 10:08 గంటలకు ‘ఓజీ’ సినిమా నుండి రెండో సాంగ్ సువ్వి సువ్వి మెలోడీని రిలీజ్ చేయబోతున్నారు. దీనికి సంబంధించిన ఒక అందమైన పోస్టర్‌లో పవన్ కల్యాణ్, ప్రియాంక మోహన్ కలిసి దీపం వదులుతున్న సన్నివేశం ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.

ఇక సినిమా రిలీజ్ వాయిదా పడుతుందన్న రూమర్స్ సోషల్ మీడియాలో వినిపించినా, అవన్నీ అబద్దమని తేలిపోయింది. ఎందుకంటే అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ఆగస్టు 29 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అంతేకాకుండా సెప్టెంబర్ 24న ప్రీమియర్లతో సినిమా స్క్రీనింగ్ మొదలుకానుంది. అంటే పవన్ కల్యాణ్ సినిమా రిలీజ్‌పై ఎలాంటి అనుమానాలూ లేవన్నమాట.

డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దానయ్య, దాసరి కళ్యాణ్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, మ్యూజిక్ మాస్ట్రో తమన్ స్వరాలను సమకూరుస్తున్నారు.



Similar News