OG Collections: రూ.200 కోట్ల క్లబ్‌లో 'ఓజీ'.. నాలుగు రోజుల్లో రూ.252 కోట్లు వసూలు..
OG Collections: పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన 'ఓజీ' (OG) సినిమా నాలుగు రోజుల్లోనే రూ. 200 కోట్ల క్లబ్ లో చేరింది.
OG Collections: పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన 'ఓజీ' (OG) సినిమా నాలుగు రోజుల్లోనే రూ. 200 కోట్ల క్లబ్ లో చేరింది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 252+ కోట్లు (గ్రాస్) వసూలు చేసిందని నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రకటించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టర్‌ను విడుదల చేసింది.
ఫస్ట్ డే రికార్డ్స్
'ఓజీ' విడుదలైన మొదటి రోజు రూ. 154 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టి, ఫస్ట్ డే అత్యధిక వసూళ్లు సాధించిన టాప్-10 భారతీయ సినిమాల జాబితాలో స్థానం సంపాదించింది. టాలీవుడ్ నుంచి ఈ ఘనత సాధించిన ఏడవ చిత్రం ఇది. ఈ సినిమా ఈ నెల 25న విడుదలైంది.
సినిమా గురించి
కొన్నాళ్లుగా పవన్ అభిమానులు ఎదురుచూస్తున్న సినిమా ఇది. దర్శకుడు సుజీత్ ఈ గ్యాంగ్‌స్టర్ డ్రామాను తెరకెక్కించారు. ఇందులో పవన్ ఓజస్ గంభీర్ పాత్రలో నటించారు. ఆయన స్టైలిష్ లుక్స్, పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్ సన్నివేశాలు, అలాగే నేపథ్య సంగీతం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. త్వరలో సినిమా విజయోత్సవ వేడుకను నిర్వహించడానికి చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈ వేడుకలో పవన్ కల్యాణ్ కూడా పాల్గొనే అవకాశం ఉందని సమాచారం.