కొరటాల కోసం భారీ యాక్షన్ సన్నివేశాలు చేయనున్న ఎన్టీఆర్
* హాలీవుడ్ కొరియోగ్రాఫర్ లతో పనిచేయనున్న ఎన్టీఆర్
కొరటాల కోసం భారీ యాక్షన్ సన్నివేశాలు చేయనున్న ఎన్టీఆర్
Jr NTR: "ఆర్ ఆర్ ఆర్" సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు యంగ్ టైగర్ ఎన్టీఆర్. అయితే ఈ సినిమా విడుదలై సంవత్సరం కావస్తోంది కానీ ఎన్టీఆర్ మాత్రం ఇంకా తన తదుపరి సినిమాని మొదలు పెట్టలేదు. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఇప్పుడు ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. "ఆచార్య" సినిమా డిజాస్టర్ అవడంతో ఈ సినిమాతో ఎలాగైనా మంచి హిట్ అందుకోవాలని కొరటాల శివ స్క్రిప్ట్ విషయంలో చాలా మార్పులు చేశారని అందుకే సినిమా షూటింగ్ వాయిదా పడిందని వార్తలు వినిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఎట్టకేలకు మొదలు కాబోతోంది.
ఈ నేపథ్యంలో చిత్ర బృందం కూడా సినిమా షూటింగ్ కోసం భారీ ప్లాన్లు వేస్తోంది. తాజా సమాచారం ప్రకారం సినిమా షూటింగ్ కోసం చిత్ర బృందం శంషాబాద్ దగ్గర ప్రాంతంలో భారీ బడ్జెట్ తో ఒక పెద్ద సెట్ ను నిర్మించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే విడుదల అయిన ఈ చిత్ర పోస్టర్ చూస్తే సినిమా ఒక భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా ప్రేక్షకుల ముందుకు రానుంది అని చెప్పుకోవచ్చు.
ఇక ఈ సినిమా కోసం ఇంతకు ముందు ఎన్నడూ చూడనటువంటి విధంగా ఇంటెన్స్ మరియు గ్రాండ్ యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాలో ఉండబోతున్నాయట. దీనికోసం చిత్ర బృందం హాలీవుడ్ నుండి కొందరు ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ లను రంగం లోకి దింపుతున్నట్టు తెలుస్తోంది. ఆ కొరియోగ్రాఫర్ ల పేర్లు త్వరలోనే విడుదల చేయబోతున్నట్టు సమాచారం.