Telugu States: తెరపై బొమ్మ పడుతుందో లేదో అనేది సందేహం

Telugu States: తెలంగాణలో లాక్​డౌన్ సడలించి, థియేటర్లకు ప్రభుత్వం అనుమతిచ్చినా తెరపై బొమ్మ పడుతుందో లేదో అనేది సందేహంగా మారింది.

Update: 2021-06-20 16:30 GMT

Telugu States: తెరపై బొమ్మ పడుతుందో లేదో అనేది సందేహం

Telugu States: తెలంగాణలో లాక్​డౌన్ సడలించి, థియేటర్లకు ప్రభుత్వం అనుమతిచ్చినా తెరపై బొమ్మ పడుతుందో లేదో అనేది సందేహంగా మారింది. ఏపీలో లాక్‌డౌన్​ నిబంధనలు కొనసాగుతుండటమే ఇందుకు కారణం. తెలుగు సినిమా రెండు రాష్ట్రాల్లో విడుదలైతేనే లాభం చేకూరుతుంది. అందుకే దర్శకనిర్మాతలు తమ చిత్రాలను విడుదల చేయడానికి ఆంధ్రాలోనూ అనుమతులు ఎప్పుడు ఇస్తారో అని వేచిచూస్తున్నారు!

సినిమా ప్రదర్శనలు నిలిచిపోయి దాదాపు రెండు నెలలైంది. రిలీజ్‌కు సిద్ధమైన సినామాలు ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ చిత్రాలన్నీ విడుదలకు సన్నద్ధమవుతున్నాయి. అయితే ఏపీలో ఇంకా లాక్‌డౌన్‌ నిబంధనలు కొనసాగుతూనే ఉన్నాయి. తెలుగు సినిమాకు 60 శాతం మార్కెట్‌ అక్కడే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలైతేనే అందరికీ మేలు జరుగుతుంది. అందుకే నిర్మాతలు ఏపీలోనూ అనుమతులు ఇచ్చేవరకు వేచి చూడక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.

ఇదివరకు విడుదలైన సినిమాలు తెలంగాణలో ప్రదర్శించుకునే అవకాశాలు ఉన్నప్పటికీ థియేటర్ల యజమానులు ఆసక్తి చూపడం లేదు. పాత సినిమాపై ప్రేక్షకులు మొగ్గు చూపడం లేదని ప్రదర్శనకారులు చెబుతున్నారు. తొలి దశ కరోనా తర్వాత థియేటర్లు తెరిచిన వెంటనే, ఓటీటీలో విడుదలైన సినిమాల్ని థియేటర్లలో ప్రదర్శనకు ఉంచారు. వాటికి ప్రేక్షకుల ఆదరణ కరవవడం వల్ల వెంటనే థియేటర్ల నుంచి తొలగించారు. ఈసారి కొత్త సినిమాలు విడుదలయ్యే వరకు వేచి చూడనున్నారు.

గత ఏడాది చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం పలు రాయితీల్ని ప్రకటించింది. థియేటర్ల కరెంటు బిల్లుల రద్దు, ప్రదర్శనల విషయంలో వెసులుబాటు తదితర విషయాల్లో ప్రభుత్వం హామీ ఇచ్చింది. అయితే ఇప్పటివరకు ఆ హామీలు నెరవేరకపోవడం వల్ల థియేటర్‌ యాజమాన్యాలు మరోమారు ప్రభుత్వం దగ్గరికి వెళ్లే అవకాశం ఉంది. ఆ హామీలపై ప్రభుత్వం స్పందించేవరకు థియేటర్లను తెరవకూడదని తెలంగాణ ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ నిర్ణయించింది. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లభిస్తే సింగిల్‌ థియేటర్లు ప్రదర్శనల్ని షురూ చేసేందుకు సిద్ధం కానున్నాయి.

Full View
Tags:    

Similar News