సెలబ్రేషన్ ల విషయంలో సైలెంట్ గా ఉన్న "పుష్ప" బృందం

Pushpa: ఈ మధ్య కాలంలో సినిమాలు రెండు మూడు వారాలకు మించి థియేటర్లలో ఉండటం గగనమై పోయిన సంగతి తెలిసిందే.

Update: 2022-02-07 13:35 GMT

సెలబ్రేషన్ ల విషయంలో సైలెంట్ గా ఉన్న "పుష్ప" బృందం

Pushpa: ఈ మధ్య కాలంలో సినిమాలు రెండు మూడు వారాలకు మించి థియేటర్లలో ఉండటం గగనమై పోయిన సంగతి తెలిసిందే. కానీ ఇలాంటి సమయంలో కూడా 50 రోజులకు పైగా ఒక సినిమా ఆడింది అంటే గొప్ప విషయం అని చెప్పుకోవాలి. "అఖండ" తర్వాత మళ్ళీ ఈ మధ్యకాలంలో ఇలాంటి రికార్డును సృష్టించిన సినిమా అల్లు అర్జున్ హీరోగా నటించిన "పుష్ప". సుకుమార్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్బస్టర్గా నిలిచింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాక మిగతా భాషల నుంచి కూడా ఈ సినిమాకి ఊహించినట్టు వంటి విధంగా మంచి రెస్పాన్స్ వచ్చింది.

కలెక్షన్ల విషయంలో కూడా తగ్గేదే లే అంటూ ఈ సినిమా రికార్డ్ ల మీద రికార్డ్ లు సృష్టించింది. హిందీలో కూడా ఈ సినిమా 100 కోట్ల మార్కును దాటింది. తమిళ్ లో 30 కోట్లు గ్రాస్ కలెక్షన్లు నమోదు చేసుకున్న ఈ సినిమా కేరళ లో 10 కోట్ల దాకా గడించింది. అయితే ఇంత ఘన విజయం సాధించిన ఈ సినిమా సక్సెస్ ని దర్శకనిర్మాతలు అంతగా సెలబ్రేట్ చేసుకోవడం లేదని అభిమానులు అనుకుంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా యాభై రోజుల్లో మూడు వందల అరవై కోట్లు కలెక్షన్లు నమోదు చేసుకున్నట్లు పోస్టర్ విడుదల చేశారు కానీ దీనికి సంబంధించిన సెలబ్రేషన్ లో మాత్రం కనిపించకపోవడం అభిమానులను ఆశ్చర్య పరుస్తోంది.

Tags:    

Similar News