Nithya Menen: రోజా మరియు ప్రియమణి లను ఫాలో అవుతున్న నిత్యామీనన్
Nithya Menen: రోజా మరియు ప్రియమణి లను ఫాలో అవుతున్న నిత్యామీనన్
Nithya Menen: రోజా మరియు ప్రియమణి లను ఫాలో అవుతున్న నిత్యామీనన్
Nithya Menen: ఈ మధ్యకాలంలో సినిమా ఆఫర్లు దాదాపు తగ్గిన అందరు హీరోయిన్లు అయితే ఓటీటీ ల వెంట లేకపోతే రియాలిటీ షోల వెంట పడుతున్న సంగతి తెలిసిందే. సినిమాలు రావట్లేదు అనుకున్న సమయంలో హీరోయిన్లు ఏవైనా రియాలిటీ షో లకి జడ్జ్ గా మారిపోతున్నారు. వెండితెరపై కాకపోయినా బుల్లితెర మీద అయినా సరే ప్రేక్షకులకి దగ్గరగా ఉండాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రోజా, ప్రియమణి, పూర్ణ తదితరులు ఒకప్పుడు స్టార్ హీరోయిన్ లు గా ఉండి ఇప్పుడు బుల్లితెరపై జడ్జ్ లుగా మారిపోయారు. తాజాగా ఇప్పుడు ఈ జాబితాలో పవన్ కళ్యాణ్ హీరోయిన్ కూడా చేరనుంది.
ఆమె మరెవరో కాదు నిత్యామీనన్. త్వరలో పవన్ కళ్యాణ్ హీరోగా విడుదల కాబోతున్న "భీమ్లా నాయక్" సినిమాలో పవన్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న నిత్యామీనన్ ఇప్పుడు ఆహా వీడియో లో త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తెలుగు ఇండియన్ ఐడల్ జడ్జిగా మారబోతోంది. ఇక నిత్య మీనన్ తో పాటు ఈ షో లో సింగర్ కార్తీక్ మరియు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా జడ్జీలుగా వ్యవహరించనున్నారు. బిగ్బాస్ సీజన్ ఫైవ్ ఫైనలిస్ట్ శ్రీ రామచంద్ర ఈ షోకు హోస్ట్గా వ్యవహరించబోతున్నారు. అయితే ఈ మధ్యనే "స్కైలాబ్" లో కనిపించిన ప్రియమణి ఈ సినిమాతో కూడా అనుకున్న స్థాయిలో విజయం సాధించలేకపోయింది.