Nithiin: లేడీ డైరెక్టర్‌తో నితిన్ కొత్త లవ్ స్టోరీ..?
Nithiin: నితిన్ మళ్లీ లవ్ స్టోరీ జోన్‌లోకి అడుగుపెడుతున్నాడు. ‘తెలుసు కదా’ డైరెక్టర్ నీరజా కోనతో కొత్త రొమాంటిక్ చిత్రం చేయనున్నాడు.
Nithiin: నితిన్ మళ్లీ లవ్ స్టోరీ జోన్‌లోకి అడుగుపెడుతున్నాడు. ‘తెలుసు కదా’ డైరెక్టర్ నీరజా కోనతో కొత్త రొమాంటిక్ చిత్రం చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్‌పై చర్చలు జరుగుతున్నాయి.
నితిన్ కెరీర్‌లో లవ్ స్టోరీలు ఎప్పుడూ ప్రత్యేకంగా నిలుస్తాయి. ఇప్పుడు మళ్లీ ఓ ఫ్రెష్ రొమాంటిక్ చిత్రం కోసం సిద్ధమవుతున్నాడు. ‘తెలుసు కదా’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న లేడీ డైరెక్టర్ నీరజా కోన ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేసే అవకాశం ఉంది. భిన్నమైన ప్రేమకథతో ఈ సినిమా రూపొందనుందని సమాచారం. ప్రస్తుతం నితిన్-నీరజా కోన మధ్య చర్చలు జరుగుతున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన రావచ్చని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఇటీవల ‘ఎక్స్‌ట్రా ఆర్డినరీ మ్యాన్’, ‘రాబిన్‌హుడ్’, ‘తమ్ముడు’ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్.. ఇప్పుడు మళ్లీ లవ్ స్టోరీతో అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతున్నాడు. అదే సమయంలో ‘ఇష్క్’ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన విక్రమ్ కే కుమార్‌తోనూ మరో సినిమా చేయబోతున్నాడు.