Nikhil Siddharth: ఆసక్తికర టైటిల్‌తో నిఖిల్ పాన్ ఇండియా సినిమా
Nikhil Siddharth: ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి పేరు తెచ్చుకున్న హీరోలలో నిఖిల్ సిద్ధార్థ్ కూడా ఒకరు.
Nikhil Siddharth: ఆసక్తికర టైటిల్‌తో నిఖిల్ పాన్ ఇండియా సినిమా
Nikhil Siddharth: ఇండస్ట్రీలో తనకంటూ ఒక మంచి పేరు తెచ్చుకున్న హీరోలలో నిఖిల్ సిద్ధార్థ్ కూడా ఒకరు. సినిమా ఎలా ఉన్నా కథ సెలక్షన్లో మాత్రం ఎప్పుడు నిఖిల్ నిరాశపరచడని అభిమానులు నమ్మకం. తాజాగా హీరో నిఖిల్ సిద్దార్థ్ నటిస్తున్న 19వ సినిమా నుంచి అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. గూడఛారి, ఎవరు, హిట్ సినిమాలకు ఎడిటర్‌గా పనిచేసిన గ్యారీ బి.హెచ్ దర్శకత్వంలో నిఖిల్ ఓ పాన్ ఇండియా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.. ఆ ప్రాజెక్ట్ టైటిల్, నిఖిల్ ఫస్ట్‌లుక్‌ను ఆదివారం విడుదల చేశారు. 'స్పై' అనే పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో నిఖిల్ గూఢచారిగా కనిపించబోతున్నట్టు పోస్టర్‌ను బట్టి తెలుస్తోంది.
ఇందులో నిఖిల్ కళ్లజోడు పెట్టుకుని, తుపాకి పట్టుకుని అందరినీ ఆకట్టుకునేలా ఉన్నాడు. ఈ సినిమా పాన్ ఇండియా లెవల్‌లో తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజ్ కానుంది. ఈ ఏడాది దసరాకు ఈ చిత్రాన్ని తీసుకురానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సినిమాలో నిఖిల్ కు జోడీగా ఐశ్వర్య మీనన్ నటిస్తోంది. ఈ చిత్రాన్ని ఈడీ ఎంటర్టైనమెంట్స్ పతాకంపై కె. రాజశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు.