RRR Movie: ఒకేరోజు రెండు సర్‌ప్రైజ్‌లు.. అభిమానులకు పండగే
RRR Posters: ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ఆర్ఆర్'...
RRR Movie: ఒకేరోజు రెండు సర్‌ప్రైజ్‌లు.. అభిమానులకు పండగే
RRR Posters: ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ఆర్ఆర్' నుంచి ఒక్కో అప్ డేట్ ను వదులుతూ వెళుతున్నారు చిత్ర బృందం. వచ్చిన ప్రతి అప్ డేట్ సినిమాపై అంతకంతకూ అంచనాలు పెంచుతూ వెళుతోంది. తాజాగా సినీ ప్రేక్షకులలో జోష్ నింపేందుకు సోమవారం రెండు సర్‌ప్రైజ్‌లు అందించింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లని విడుదల చేసింది.
ఇద్దరు హీరోలు చాలా పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించి అభిమానుల్ని ఆకట్టుకునేలా ఉన్నారు. ప్రస్తుతం ఈ రెండు పోస్టర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డి.వి.వి దానయ్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఆలియాభట్, ఒలివియా మోరీస్ నాయికలుగా, అజయ్ దేవగణ్, శ్రియ కీలక పాత్రధారులుగా కనిపించనున్నారు. జనవరి 7న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
NTR New Poster From RRR Movie
Ram Charan New Poster From RRR Movie