Megastar Chiranjeevi : చిరుకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన నెల్లూరు కుర్రాళ్ళు!
Megastar Chiranjeevi : మొన్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డేకి సరిలేరు నీకెవ్వరులోని ఇంటర్వెల్ ఫైట్ ని చేసి అదరగొట్టారు కదా
Nellore boys recreate chiranjeevis khaidi no 150 Movie Fight scene
Megastar Chiranjeevi : మొన్న టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డేకి సరిలేరు నీకెవ్వరులోని ఇంటర్వెల్ ఫైట్ ని చేసి అదరగొట్టారు కదా నెల్లూరు కుర్రాళ్ళు.. ఆ వీడియో సోషల్ మీడియాలో చాలా వైరల్ అయింది.. ఇప్పడు టాలీవుడ్ మెగాస్టార్ పుట్టినరోజు సందర్భంగా ఖైది 150 లోని ఇంటర్వెల్ ఫైట్ ని చేసి ఫిదా చేశారు.. ప్రస్తుతం ఈ వీడియో కూడా నేట్టింట్లో కూడా వైరల్ అవుతుంది.. మొత్తం మొబైల్లోనే ఈ ఫైట్‌సీన్‌ను తీసి ఎడిట్ చేశారు.. నెల్లూరుకు చెందిన 19 ఏళ్ల కిరణ్. ఐయామ్ వెయిటింగ్ అంటూ మెగాస్టార్ చెప్పిన డైలాగ్స్‌ను ఈ వీడియోలో పెట్టారు. ఈ వీడియో నెటిజన్లను బాగా ఆకట్టుకుంది.. మరి ఈ వీడియో పైన మెగాస్టార్ ఎలా స్పందిస్తాడో చూడాలి మరి!
ఇక మెగాస్టార్ చిరంజీవి నేడు 65 పుట్టినరోజును జరుపుకుంటున్నారు.. ఆయనకి సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ రాజకీయ, క్రీడా ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.. ఇక ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాని చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.. ఇది చిరంజీవికి 152 వ సినిమా కావడం విశేషం.. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.. రేపు చిరంజీవి పుట్టినరోజు కావడంతో ఆచార్య సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ని రేపు సాయింత్రం నాలుగు గంటలకి రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర నిర్మాతల్లో ఒకరైనా రామ్ చరణ్ తేజ్ వెల్లడించారు.. దీనితో అభిమానుల్లో ఆసక్తి మొదలైంది.