Chiranjeevi And Pawan kalyan : గత ఏడాది పవన్.. ఈ ఏడాది చిరు!

Chiranjeevi And Pawan kalyan : గత ఏడాది పవన్.. ఈ ఏడాది చిరు!
x

chiranjeevi and pawan kalyan 

Highlights

Chiranjeevi And Pawan kalyan : మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలో యాదృచ్చికంగా జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్

Chiranjeevi And Pawan kalyan : మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ విషయంలో యాదృచ్చికంగా జరిగిన ఓ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అదేంటంటే.. గత ఏడాది సెప్టెంబర్ 02 పవన్ కళ్యాణ్ పుట్టినరోజున వినాయక చవితి రాగా, ఈ ఏడాది ఆగస్టు 22 న చిరంజీవి పుట్టిన రోజున వినాయక చవితి రావడం విశేషం.. ఇది మెగా బ్రదర్స్ కు యాదృచ్చికమే అయిన ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకుంటున్నారు. ఇక రేపు చిరంజీవి తన 65 పుట్టిన రోజును జరుపుకుంటున్నారు..

ఇక ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమాని చేస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.. ఇది చిరంజీవికి 152 వ సినిమా కావడం విశేషం.. ఇందులో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.. రేపు చిరంజీవి పుట్టినరోజు కావడంతో ఆచార్య సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ని రేపు సాయింత్రం నాలుగు గంటలకి రిలీజ్ చేస్తున్నట్టుగా చిత్ర నిర్మాతల్లో ఒకరైనా రామ్ చరణ్ తేజ్ వెల్లడించారు.. దీనితో అభిమానుల్లో ఆసక్తి మొదలైంది.

ఇక అటు పవన్ అజ్ఞాతవాసి సినిమా తర్వాత రెండు ఏళ్ళు విరామం తీసుకొని మళ్ళీ వరుసపెట్టి సినిమాలను చేస్తున్నాడు.. ఇప్పటికే మూడు సినిమాలను కమిట్ అయ్యాడు పవన్.. అందులో పవన్ రీఎంట్రీ మూవీగా వకీల్ సాబ్ అనే సినిమా తెరకెక్కుతుంది. ఇది పవన్ కళ్యాణ్ కి 26 వ సినిమా కావడం విశేషం.. ఈ సినిమా తరవాత క్రిష్, హరీష్ శంకర్ డైరెక్షన్ లలో సినిమాలను చేసేందుకు సిద్దం అయ్యాడు పవన్..

Show Full Article
Print Article
Next Story
More Stories