Cruise Drugs Case: ఆర్యన్‌తో అనన్య డ్రగ్స్ వాట్సాప్ చాట్‌పై NCB ఆరా
*అనన్యను నాలుగు గంటల పాటు విచారించిన NCB *జీవితంలో ఎప్పుడూ డ్రగ్స్ తీసుకోలేదన్న అనన్య పాండే
ఆర్యన్‌తో అనన్య డ్రగ్స్ వాట్సాప్ చాట్‌పై NCB ఆరా(ఫైల్ ఫోటో)
Cruise Drugs Case: డ్రగ్స్ తానెప్పుడూ తీసుకోలేదని బాలీవుడ్ నటి అనన్య పాండే ఎన్‌సీబీ అధికారులకు చెప్పారు. షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌కు డ్రగ్స్ కొనుగోలు కోసం తాను ఎప్పుడూ సహాయం చేయలేదన్నారు. ముంబై క్రూయిజ్‌లో మాదక ద్రవ్యాలు పట్టుబడిన కేసులో వరుసగా రెండోరోజు అనన్య పాండే ఎన్‌సీబీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో అరెస్టయిన ఆర్యన్ ఖాన్‌తో రెండేళ్ల క్రితం నాటి వాట్సాప్ సంభాషణల ఆధారంగా అనన్య పాండేను ఎన్‌సీబీ విచారిస్తోంది.
2018–19లో డ్రగ్స్ డీలర్ల నంబర్లు ఇవ్వడంలో అనన్య సహకరించినట్టుగా వారి వాట్సాప్ చాట్‌ల ద్వారా తెలుస్తోందని ఎన్‌సీబీ వర్గాలు తెలిపాయి. స్టార్ హీరోల పిల్లల గెట్ టు గెదర్ పార్టీలలో ఆర్యన్ ఖాన్‌కి అనన్య డ్రగ్స్ సరఫరా చేసినట్టుగా వారి సంభాషణల ద్వారా అవగతమవుతోందని ఎన్‌సీబీ వెల్లడించింది. అనన్య సమాధానాలు సంతృప్తిగా లేకపోవడంతో మళ్లీ సోమవారం విచారణకు హాజరు కావాలని ఎన్‌సీబీ ఆదేశించింది.