Nayanthara Surrogacy: నయనతార పెళ్లి ఆరేళ్ల క్రితమే జరిగిపోయిందా?
ఆరేళ్ల క్రితం పెళ్లి చేసేసుకున్న నయనతార మరియు విఘ్నేష్ శివన్
Nayanthara Surrogacy: నయనతార పెళ్లి ఆరేళ్ల క్రితమే జరిగిపోయిందా?
Nayanthara Surrogacy: సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార మరియు ప్రముఖ డైరెక్టర్ విగ్నేష్ శివన్ ఈ ఏడాది జూన్ 9న మహాబలిపురంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే పెళ్లయిన నాలుగు నెలలకే నవ దంపతుల నుంచి తల్లిదండ్రులుగా మారిపోయింది ఈ జంట. ఈ నేపథ్యంలో నయనతార మరియు విగ్నేష్ సరోగసి ద్వారా తల్లిదండ్రులు అయ్యారు అని అర్థమవుతుంది. అయితే ఈ జంట సరోగేసీ నిబంధనల ప్రకారం గానే జరిగిందా లేదా అని తెలుసుకోవడానికి తమిళనాడు ప్రభుత్వం ఈ జంటకు నోటీసులు జారీ చేసింది.
వీరి సరోగసీ చట్టబద్ధమైనదా కాదా అని ముగ్గురు సభ్యులు గల ఒక కమిటీని కూడా నియమించారు తమిళనాడు ఆరోగ్య మంత్రి మా సుబ్రమణియన్. ఒక వారం రోజుల్లో వీరు ప్రభుత్వానికి నివేదికను సమర్పించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా నయనతార మరియు విగ్నేష్ లను విచారించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సమస్య నుంచి లీగల్ గా బయటకు రావాలి అని వీరు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
నిబంధనల ప్రకారం ఏదైనా ఒక జంట వివాహం అయిన ఐదేళ్ల తరువాత మాత్రమే సరోగసీను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ చట్టం జనవరి 2022 నుంచే అమల్లోకి వచ్చింది. అయితే తాజా సమాచారం ప్రకారం నయనతార మరియు విగ్నేష్ శివన్ వివాహం ఆరేళ్ల క్రితమే జరిగిపోయింది అని ఆరోగ్య శాఖకు అఫిడవిట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఆరేళ్ల క్రితమే తమ వివాహం రిజిస్టర్ అయినట్లుగా పత్రాలను కూడా సమర్పించారట. దీంతో ఆరేళ్ల క్రితమే వీరి పెళ్లి జరిగిందని అభిమానులు సైతం షాక్ కి గురి అవుతున్నారు.