Nayantara: మహేష్-త్రివిక్రమ్ మూవీలో లేడీ సూపర్ స్టార్…

Nayantara: మహేష్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటించబోతున్నట్లుగా సినీ వర్గాల్లో టాక్

Update: 2021-07-06 02:04 GMT

Nayantara-Mahesh Babu

Nayantara: అసలే మనోడు చాక్లెట్ బాయ్. ఏజ్ అసలే కనపడదు. మరి సీనియర్ హీరోయిన్ పక్కన సెట్ అవుద్దా లేదా? ఇదే ఆలోచనలో ఉన్నారు మహేష్ బాబు ఫ్యాన్స్. ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ తో తీసే సినిమాలో నయనతారను ఒక హీరోయిన్ గా అనుకుంటున్నారంట. మరి కథ డిమాండ్ చేసిందో.. లేక ఆ కేరెక్టర్ అంత ఇంపార్టెంటో తెలియదు గాని.. మహేష్ బాబు, నయనతార కాంబినేషన్ ఎలా ఉంటుందోనని అభిమానులు అంచనాలు వేస్తున్నారు. ఇది ఒక విధంగా సర్ ప్రైజింగ్ న్యూస్ ఫ్యాన్స్ కి.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.. ప్రస్తుతం పరశురామ్ దరశత్వంలో "సర్కారు వారి పాట" సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ తర్వాత మహేష్.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీరిద్దరి కాంబోలో అతడు, ఖలేజా వంటి సూపర్ హిట్ చిత్రాల తర్వాత.. మరోసారి వీరిద్దరి కలయికలో హ్యాట్రిక్ మూవీకి అధికారిక ప్రకటన వచ్చింది. ఈ చిత్రాన్ని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై రాధకృష్ణ (చినబాబు) నిర్మిస్తుండగా.. ఈ చిత్రానికి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. ఇక మహేష్ నటించనున్న ఈ 28వ చిత్రానికి త్రివిక్రమ్ నటీనటులను ఎంపిక చేసే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో త్రివిక్రమ్ ఇద్దరు హీరోయిన్స్ ను తీసుకోవాలని భావిస్తున్నాడట.

ఇక తాజా సమాచారం ప్రకారం.. మహేష్ సరసన లేడీ సూపర్ స్టార్ నయనతార నటించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మేకర్స్.. నయన్‏తో చర్చలు జరుపుతున్నారని టాక్. ఒకవేళ నయన్ ఈ ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే.. మహేష్ సరసన మొదటి సారి నయన్ స్క్రీన్ షేర్ చేసుకోబోతుందని చెప్పవచ్చు. అలాగే మరో హీరోయిన్‏గా బాలీవుడ్ బ్యూటీని ఎంపిక చేయాలనుకుంటున్నారట మేకర్స్. అయితే ఆ హీరోయిన్ ఎవరనేది ఇంకా తెలియాల్సి ఉంది. ఇక త్రివిక్రమ్, మహేష్ కాంబోలో వచ్చే ఈ మూవీ పక్కా కమర్షియల్ ఎంటర్ టైనర్ అని డిఫరెంట్ డైమెన్షన్స్ లో ఉంటుందని ముందు నుంచే కథనాలు వస్తున్నాయి.

Tags:    

Similar News