Natural star Nani: నిర్మాతలకి షాక్ ఇచ్చిన నాని..!?
Natural star Nani: "శ్యామ్ సింగారాయ్", "అంటే సుందరానికి" వంటి సినిమాలతో మంచి సూపర్ హిట్ లను అందుకున్న నాచురల్ స్టార్ నాని..
Natural star Nani: నిర్మాతలకి షాక్ ఇచ్చిన నాని..!?
Natural star Nani: "శ్యామ్ సింగారాయ్", "అంటే సుందరానికి" వంటి సినిమాలతో మంచి సూపర్ హిట్ లను అందుకున్న నాచురల్ స్టార్ నాని తాజాగా ఇప్పుడు "దసరా" సినిమాతో బిజీగా ఉన్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే యాక్షన్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ కు ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది.
ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. అయితే మరోవైపు తెలుగు సినిమా నిర్మాతల ఛాంబర్ బంద్ ప్రకటించిన సంగతి తెలిసిందే. నిర్మాతల సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు బంద్ చేపడతామని చెబుతున్న నిర్మాతలు సినిమా షూటింగ్‌లను నిలిపివేశారు. కానీ ఈ రూల్స్ ఏవి నాని దసరా సినిమాకి అప్లై అవ్వవు. ఎందుకంటే "దసరా" సినిమా షూటింగ్ త్వరలోనే మొదలు కాబోతోంది.
నిర్మాత సుధాకర్ చెరుకూరి ఏదేమైనా షూటింగ్ని మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారట. నాని కూడా నిర్మాత కోరిక మేరకు షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. ఇంకా ఆలస్యం చేసి వడ్డీలను పెంచుకోవడం కంటే షూటింగ్ మొదలు పెడితే బాగుంటుందని సుధాకర్ చెరుకూరి ఈ నిర్ణయానికి వచ్చారట. కానీ మరోవైపు ప్రొడ్యూసర్స్ నానిని షూటింగ్ కి వెళ్ళవద్దని చెబుతున్నట్లుగా తెలుస్తోంది. మరి నాని ఎవరి మాట వింటారో వేచి చూడాలి.