The Paradise Glimpse:హై వోల్టేజ్ మాస్ రోల్‌లో నాని.. ది ప్యారడైజ్ గ్లింప్స్
నేచురల్ స్టార్ నాని.. తన ప్రతి సినిమాలో ఏదో కొత్తదనం ఉండేలా చూసుకుంటారు. అందుకే నాని సినిమా అంటే ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఈ సారి కూడా ఓ కొత్త క్యారెక్టర్‌తో సర్ ప్రైజ్ చేయబోతున్నారు నాని.
హై వోల్టేజ్ మాస్ రోల్‌లో నాని.. ది ప్యారడైజ్ గ్లింప్స్
The Paradise Glimpse: నాచురల్ స్టార్ నాని.. తన ప్రతి సినిమాలో ఏదో కొత్తదనం ఉండేలా చూసుకుంటారు. అందుకే నాని సినిమా అంటే ప్రేక్షకులు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. అయితే ఈ సారి కూడా ఓ కొత్త క్యారెక్టర్‌తో సర్ ప్రైజ్ చేయబోతున్నారు నాని. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ది ప్యారడైజ్. ఇప్పటికే ఈ సినిమాపై రకరకాల గాసిప్స్ తెరపైకి వచ్చాయి. తాజాగా ఈ మూవీ నుంచి గ్లింప్స్ వీడియో వచ్చేసింది. ది ప్యారడైజ్ గ్లింప్స్ పవర్ ఫుల్ డైలాగ్‌లు, విజువల్స్, నాని డిఫరెంట్ గెటప్‌తో అదిరిపోయింది.
ఈ వీడియోలో నాని యాక్షన్ వేరే లెవల్‌లో ఉంది. చరిత్రలో అందరూ చిలకలు, పావురాలు గురించి రాశారు కానీ.. అదే జాతిలో పుట్టిన కాకుల గురించి ఎవరూ రాయలేదు అంటూ మొదలయ్యే గ్లింప్స్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. ఇది కడుపు మండిన కాకుల కథ.. జమానా జమానాకెళ్లి నడిచే శవాల కథ, అమ్మ రొమ్ములో పాలు లేక రక్తం పోసి పెంచిన ఓ జాతి కథ అంటూ సాగే ఎలివేషన్ చూస్తుంటే మూవీలో యాక్షన్ వేరే లెవల్‌లో ఉందని తెలుస్తోంది.
ది ప్యారడైజ్ మూవీలో నాని చాలా డిఫరెంట్ గెటప్‌లో కనిపించనున్నారు. ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విధంగా అతని లుక్ డిజైన్ చేశారు. పొడవాటి రెండు జడలు, మెలికలు తిగిన కండలు, కోర మీసం, ముక్కెరఇలా ఓ వైల్డ్ లుక్‌లో ఉన్నారు. అణచివేతకు గురై తిరుగుబాటు చేసిన ఓ దళానికి నాయకుడి పాత్రను నాని ఈ చిత్రంలో పోషిస్తున్నట్టు అర్థమవుతుంది. ది ప్యారడైజ్ గ్లింప్స్ తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, బెంగాలి, కన్నడ, ఇంగ్లీష్, స్పానిష్‌లో భాషల్లోనూ విడులైంది. స్పానిష్ భాషలో డబ్బింగ్ చెప్పిన తొలి భారతీయ నటుడిగా నాని రికార్డు సృష్టించారు.
అనిరుధ్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో లెవెల్ అనేలా ఉంది. టీజర్‌లో నాని పూర్తి ముఖాన్ని చూపించకపోవడం సినిమాపై మరింత మిస్టరీని పెంచేలా చేసింది. కథ, కథనం, విజువల్స్ అన్నీ పవర్ ఫుల్‌గా కనిపిస్తున్నాయి. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తన గత సినిమా దసరా తర్వాత మరింత పవర్ ఫుల్ కాన్సెప్ట్‌తో ది ప్యారడైజ్ రూపొందిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది సమ్మర్ నాటికి థియేటర్‌లోకి రానుంది.
ఈ మూవీని ఎస్‌ఎల్‌వీ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా.. ది ప్యారడైజ్ మూవీ గ్లింప్స్‌కే దాదాపు రూ.కోటి ఖర్చు చేసినట్టు సమాచారం. గ్లింప్స్ వీడియోలోని హైక్వాలిటీ వీఎఫ్ఎక్స్ షాట్స్ హైలెట్‌గా నిలిచాయి. దాదాపు రూ.100 కోట్లతో మూవీ తెరకెక్కినట్టు తెలుస్తోంది. హీరో నానితో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఫస్ట్ మూవీ దసరా మంచి హిట్ అందుకుంది. దీంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్నారు. జెర్సీ, గ్యాంగ్ లీడర్ విజయాల తర్వాత వీరి కాంబోలో వస్తున్న మూడో చిత్రమిది.