Nani: కొత్త దర్శకుడి మూవీ నుంచి నాని తప్పుకున్నాడా?

Nani: నాచురల్ స్టార్ నాని ఇటీవల 'వి' సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు.

Update: 2021-05-24 17:45 GMT

నాని (ఫొటో ట్విట్టర్)

Nani: నాచురల్ స్టార్ నాని ఇటీవల 'వి' సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాడు. తన రాబోయే చిత్రం 'టక్ జగదీష్' విడుదల కోసం ఎదురుచూస్తున్నాడు.

ఆయన తదుపరి సినిమా 'శ్యామ్ సింఘ రాయ్' ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది. తాజా నివేదికల ప్రకారం, నాని కొత్త దర్శకుడు శ్రీకాంత్‌తో కలిసి ఓ ప్రాజెక్ట్ చేసేందుకు అంగీకరించాడు. కానీ, ప్రస్తుతం ఈ చిత్రాన్ని ఆపినట్లు సమాచారం. నాని మొదట్లో ఈ కథను ఇష్టపడినప్పటికీ, ఏవో కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్‌ ఆగిపోయిందని టాక్ వినిపిస్తోంది.

డైరెక్టర్ శ్రీకాంత్.. నాని కోసం తెలంగాణ బ్యాక్ డ్రాప్‌లో సాగే ప్రేమకథను సిద్ధం చేశాడని తెలుస్తోంది. నాని కూడా ఓకే చెప్పాడని, తీరా మేకర్స్ ఈ సినిమాని ప్రకటించాలని అనుకునేలోపు నాని ఈ ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

'విరాట పర్వం' ఫేమ్ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఈ ప్రాజెక్టును నిర్మించేందుకు సిద్ధంగా ఉందని తెలుస్తోంది. మరిన్ని వివరాలు త్వరలో తెలియనున్నాయి.

Tags:    

Similar News