Shyam Singha Roy: కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లేతో "శ్యామ్ సింగరాయి"

Shyam Singha Roy: "శ్యామ్ సింగరాయి" కథ ప్రేక్షకులకి అర్థమవుతుందా?

Update: 2021-12-15 11:49 GMT

 కాంప్లికేటెడ్ స్క్రీన్ ప్లేతో "శ్యామ్ సింగరాయి" (ఫైల్ ఫోటో)

Shyam Singha Roy: ఈ మధ్యనే "టక్ జగదీష్" సినిమాతో ఫ్లాప్ అందుకున్న నాచురల్ స్టార్ నాని తన ఆశలన్నీ తన తదుపరి సినిమా అయిన "శ్యామ్ సింగరాయి" పైనే పెట్టుకున్నాడు. తన కరియర్ లోనే భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కనున ఈ సినిమాలో "ఉప్పెన" బ్యూటీ కృతి శెట్టి, మడోన్నా సెబాస్టియన్ మరియు సాయి పల్లవి లు హీరోయిన్ లుగా నటిస్తున్నారు. "టాక్సీవాలా" ఫేమ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాయన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. చాలావరకు సినిమా కథ కలకత్తా బ్యాక్ డ్రాప్తో జరగనుంది. అయితే ఒక వైపు ప్రస్తుతం జరుగుతున్న కథ మాత్రమే కాక మరోవైపు 1960లో కథ రన్ అవ్వనుంది.

ఎపిక్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో టైం ట్రావెల్ వంటి కాన్సెప్ట్ కూడా ఉన్నాయని, అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ కూడా ఉండబోతున్నాయని తెలుస్తోంది. అయితే ఈ మధ్యనే విడుదలైన ట్రైలర్ చూస్తే స్క్రీన్ ప్లే చాలా కాంప్లికేటెడ్ గా ఉంటుందేమో అని అనిపిస్తోంది. దీంతో సినిమా ఆడియెన్స్ కి అర్థమవుతుందా అని, అభిమానులతో పాటు ట్రేడ్ వర్గాలు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఒకవేళ స్క్రీన్ప్లే ప్రేక్షకులకి అర్థమైతే సినిమా కచ్చితంగా హిట్ అవుతుందని కొందరు విశ్లేషిస్తున్నారు. నిహారిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 24న విడుదల కాబోతోంది.

Tags:    

Similar News