Nandini Reddy: మా ఇంటర్వ్యూ ఎడిట్ చేశారు.. అందుకే ఇలా అయింది..
Nandini Reddy: "పావు గంట అరగంట ఫుటేజ్ తీసేసారు.. అందుకే ఇలా అయింది," అంటున్న ఫిమేల్ డైరెక్టర్
Nandini Reddy: "అందుకే వెంకటేష్ మహా కామెంట్లకు నవ్వాల్సి వచ్చింది," అంటున్న నందిని రెడ్డి
Nandini Reddy: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న ఫిమేల్ డైరెక్టర్లను వేళ్ళతో లెక్కపెట్టొచ్చు. అందులో మొదట వినిపించే పేరు నందిని రెడ్డి. 2011లో నాని మరియు నిత్యామీనన్ హీరో హీరోయిన్లుగా నటించిన "అలా మొదలైంది" సినిమాతో డైరెక్టర్ గా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నందిని రెడ్డి మొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నారు. సమంత హీరోయిన్ గా నటించిన "ఓ బేబీ" సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకున్న నందిని తాజాగా ఇప్పుడు సంతోష్ శోభన్ మరియు మాళవిక నాయర్ హీరో హీరోయిన్లుగా "అన్నీ మంచి శకునములే" అనే సినిమాతో బిజీగా ఉన్నారు.
అయితే తాజాగా ఇండస్ట్రీలోని మరికొందరు డైరెక్టర్లతో పాటు నందిని రెడ్డి ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. అందులో భాగంగా మాట్లాడుతూ "కేర్ ఆఫ్ కంచరపాలెం" ఫేమ్ డైరెక్టర్ వెంకటేష్ మహా కె జి ఎఫ్ సినిమా గురించి కొన్ని షాకింగ్ కామెంట్లు చేశారు. అందులో హీరో యష్ పాత్ర గురించి, సినిమాలో తల్లి పాత్ర గురించి విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలో పక్కనే ఉన్న డైరెక్టర్లు కూడా నవ్వుతున్నారు. దీంతో వెంకటేష్ మహా తో పాటు ఆ కామెంట్లకు నవ్విన డైరెక్టర్లపై కూడా నెటిజెన్లు విరుచుకుపడుతున్నారు.
తాజాగా ఈ కాంట్రవర్సీ పై నందిని రెడ్డి రియాక్ట్ అయ్యారు. "కే జీ ఎఫ్ సినిమా పై దర్శకుడు మహా చేసిన కామెంట్ల ఇంటర్వూ విడియోలో చాలా భాగం ఎడిట్ చేసి అప్లోడ్ చేసారు. మొత్తం విడియో పెట్టి ఉంటే అసలు నేను అలా ఎందుకు నవ్వాల్సి వచ్చింది లేదా మాట్లాడాల్సి వచ్చింది అనేది తెలుస్తుంది. ఇంటర్వూ చేసిన వాళ్లు అలా ఎడిట్ చేసి పెట్టడం ఏమాత్రం బాగాలేదు. అసలు ఆ కామెంట్లకు ముందు పావుగంట అరగంట ఫుటేజ్ ను డిలీట్ చేసేసారు," అంటూ ఆరోపించారు నందిని రెడ్డి.