Nandamuri Balakrishna : బాలకృష్ణ సినీ ప్రస్థానానికి 46 ఏళ్ళు..
Nandamuri Balakrishna : నందమూరి తారకరామారావు నటవారుసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు బాలకృష్ణ.. అయితే బాలకృష్ణ
tatamma kala movie
Nandamuri Balakrishna : నందమూరి తారకరామారావు నటవారుసుడిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాడు బాలకృష్ణ.. అయితే బాలకృష్ణ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి నేటితో 46 ఏళ్ళు పూర్తి అయ్యాయి. ఆగస్టు 30, 1974లో తన 14 ఏళ్ళు వయసులో 'తాతమ్మ కల'తో సినీ ప్రస్థానం మొదలు పెట్టారు బాలయ్య, తొలి సినిమాతోనే బాలయ్య అదరగొట్టాడు. ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో నటించి మెప్పించారు. ఈ చిత్రానికి ఎన్టీఆర్ స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం వహించారు. ఎన్టీఆర్ తర్వాతి జనరేషన్ లో కూడా పౌరాణిక, జానపద, చారిత్రాత్మక, భక్తీరస, సైన్స్ పిక్షన్, సాంఘీక చిత్రాలు చేసిన ఏకైక కథానాయకుడు బాలకృష్ణనే కావడం విశేషం.. ఈ సందర్భంగా ఆయనకి అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్, అన్న హరికృష్ణతో కలిసి నటించారు.
ప్రస్తుతం బాలకృష్ణ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఇది బాలకృష్ణకి 106 వ చిత్రం.. సింహ, లెజెండ్ సినిమాల తర్వాత వీరిద్దరి నుండి వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని ద్వారకా క్రియేషన్స్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో బాలయ్య సరసన అంజలి హీరోయిన్ గా నటిస్తోంది. దాదాపుగా 50 శాతం కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కరోనా వలన వాయిదా పడింది. ఇక బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ వీడియో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.