Balakrishna, Boyapati Movie : బాలయ్య, బోయపాటి సినిమాకి కృష్ణవంశీ టైటిల్?

Balakrishna, Boyapati Movie : నందమూరి నటసింహం బాలకృష్ణ , మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే

Krishna
Published on: 25 Aug 2020 2:32 PM IST
Balakrishna, Boyapati Movie : బాలయ్య, బోయపాటి సినిమాకి కృష్ణవంశీ టైటిల్?
X

Balakrishna

Balakrishna, Boyapati Movie : నందమూరి నటసింహం బాలకృష్ణ , మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇది బాలకృష్ణకి 106 వ చిత్రం.. సింహ, లెజెండ్ సినిమాల తర్వాత వీరిద్దరి నుండి వస్తున్న సినిమా కావడంతో సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాని ద్వారకా క్రియేషన్స్ పై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇందులో బాలయ్య సరసన అంజలి హీరోయిన్ గా నటిస్తోంది.

దాదాపుగా 50 శాతం కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా కరోనా వలన వాయిదా పడింది. ఇక బాలయ్య పుట్టిన రోజు సందర్భంగా రిలీజ్ చేసిన స్పెషల్ వీడియో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాకి రకరకాల టైటిల్స్ వినిపిస్తున్నాయి.. 'మోనార్క్' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టుగా ఫిలింనగర్ లో న్యూస్ వినిపించింది.. అయితే ఇప్పుడు ఈ సినిమాకి గతంలో క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన డేంజర్ మూవీ టైటిల్ ని బాలయ్య సినిమాకి ఫిక్స్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. కానీ దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు..

ఇక సింహా , లెజెండ్ సినిమాలలో లాగే ఈ సినిమాలో కూడా బాలకృష్ణ రెండు పాత్రలలో కనిపించనున్నారని తెలుస్తోంది. అందులోనూ ఓ పాత్ర వారణాశి సమీపంలో ఉండే అఘోరాదిని తెలుస్తోంది. ఈ సినిమాని సంక్రాంతికి రిలీజ్ చేసే అవకాశం ఉంది.. ఇక ఎలాగు బాలయ్యకి సంక్రాంతి హీరోగా మంచి పేరున్న సంగతి తెలిసిందే.. ఇక బాలయ్య నుంచి సరైనా సినిమా వచ్చి కూడా చాలా రోజులు అయింది. గత ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా తన సొంత బ్యానర్ లో తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది. ఇక కేయస్ రవికుమార్ దర్శకత్వంలో చేసిన రూలర్ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది.

Krishna

Krishna

Next Story