దటిజ్ బాలయ్య.. బోయపాటి సినిమాకి హెవీ రిస్క్

దటిజ్ బాలయ్య.. బోయపాటి సినిమాకి హెవీ రిస్క్
x
Balakrishna
Highlights

పాత్ర నచ్చితే ప్రాణం పెట్టేస్తారు సీనియర్ హీరో బాలకృష్ణ.. అందకు చక్కటి ఉదాహరణే బైరవద్వీపం సినిమా .. ఎంతో అందంగా ఉండే బాలయ్య

పాత్ర నచ్చితే ప్రాణం పెట్టేస్తారు సీనియర్ హీరో బాలకృష్ణ.. అందకు చక్కటి ఉదాహరణే బైరవద్వీపం సినిమా .. ఎంతో అందంగా ఉండే బాలయ్య ఆ సినిమాలో ఓ సన్నివేశంలో అందవిహీనంగా కనిపించేందుకు కూడా వెనుకాడలేదు.. అంతలా సినిమాకి సలైండర్ అవుతారు బాలకృష్ణ.. సీనియర్ ఎన్టీఆర్ కుమారుడిగా ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ విభిన్నమైన పాత్రలు, సినిమాలు చేసి తనకంటూ ఓ శైలిని ఏర్పరుచుకున్నారు బాలకృష్ణ..

ఇది ఇలా ఉంటే గత కొద్దిరోజులుగా ప్లాపులతో సతమతం అవుతున్నారు బాలకృష్ణ.. గత ఏడాది ఎంతో ప్రతిష్టాత్మకంగా తన సొంత బ్యానర్ లో తెరకెక్కించిన ఎన్టీఆర్ బయోపిక్ ఆశించిన విజయాన్ని అందించలేకపోయింది. ఇక కేయస్ రవికుమార్ దర్శకత్వంలో చేసిన రూలర్ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇక ప్రస్తుతం బాలకృష్ణ, బోయపాటి దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నారు.

సింహా , లెజెండ్ సినిమాల తరవాత బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో ఓ సినిమా వస్తుండడంతో సినిమాపైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక సింహా , లెజెండ్ సినిమాలలో లాగే ఈ సినిమాలో కూడా బాలకృష్ణ రెండు పాత్రలలో కనిపించనున్నారని తెలుస్తోంది. అందులోనూ ఓ పాత్ర వారణాశి సమీపంలో ఉండే అఘోరాదిని తెలుస్తోంది.

అయితే ఈ పాత్ర కోసం బాలకృష్ణ ఏకంగా 25 కేజీల బరువు తగ్గారని తెలుస్తోంది. ఇందుకోసం రోజుకు మూడు గంటల పాటు జిమ్ చేయడంతో పాటు పోషకాహారం తీసుకున్నారని తెలుస్తోంది. తాజాగా రూలర్ సినిమాలో కూడా బాలయ్య ఓ పాత్ర కోసం చాలా బరువు తగ్గి ఎంతో యంగ్ గా కనిపించిన అందరిని ఆశ్చర్యపరిచిన సంగతి తెలిసిందే..

ఇక ఈ సినిమాకి హీరోయిన్స్ గా ఇద్దరి ఛాన్స్ ఉండడంతో అంజలిని మొదటి హీరోయిన్ గా ఫిక్స్ చేసిన చిత్రబృందం.. రెండో హీరోయిన్ గా శ్రియను అనుకుంటున్నట్టుగా సమాచారం.. ఈ సినిమాని దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.. తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories