NBK 108: రేపే బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమా ఆరంభం
NBK 108: రేపే బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమా ఆరంభం
NBK 108: రేపే బాలకృష్ణ, అనిల్ రావిపూడి సినిమా ఆరంభం
Balakrishna Anil Ravipudi Movie: "క్రాక్" సినిమాతో సూపర్ హిట్ కొట్టిన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. "వీర సింహారెడ్డి" అనే టైటిల్ తో వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతోంది. శృతిహాసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా తర్వాత బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా సైన్ చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం రవి తేజ "ఖిలాడి" సినిమా షూటింగ్ కోసం వేసిన ఒక జైలు సెట్ ని కొంత ఎక్స్టెండ్ చేసి ఈ సినిమా కోసం వినియోగించనున్నారని తెలుస్తోంది.
తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక జవాల్కర్ ను ఎంపిక చేసినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. షార్ట్ ఫిలిమ్స్ తో మంచి పేరు తెచ్చుకున్న ప్రియాంక జవాల్కర్ విజయ్ దేవరకొండ హీరోగా నటించిన "టాక్సీవాలా" సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన "ఎస్ఆర్ కళ్యాణమండపం" సినిమాలో కూడా హీరోయిన్ గా కనిపించిన ప్రియాంక ఇప్పుడు ఏకంగా నందమూరి బాలకృష్ణ సరసన నటించే అవకాశాన్ని అందుకుంది.
అయితే బాలకృష్ణ వంటి సీనియర్ హీరో సరసన ప్రియాంక వంటి యువ హీరోయిన్ ఎలా సెట్ అవుతుంది అని మరికొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఈ సినిమా కోసం రేపు అనగా 8వ తేదీన హైదరాబాదులో ఉదయం 9:36 కి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా సినిమాని నిర్మిస్తున్న షైన్ స్క్రీన్స్ వారు ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.