Naga Chaitanya: శోభితలో నాకు నచ్చే విషయం అదే: నాగచైతన్య..
Sobhita naga chitanya: తెలుగు స్టార్ హీరో అక్కినేని నాగచైతన్య తన సతీమణి శోభితపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. శోభితలో తనకు నచ్చే అంశాన్ని ప్రస్తావించారు.
Naga Chaitanya: శోభితలో నాకు నచ్చే విషయం అదే: నాగచైతన్య..
Sobhita naga chitanya
అక్కినేని వారసుడు అక్కినేని నాగచైతన్య 'తండేల్' సినిమా సక్సెస్ జోష్‌లో ఉన్నారు. ఇటీవల తన భార్య శోభితను తీసుకుని ఆయన వెకేషన్ వెళ్లారు. ఈనేపథ్యంలో ఆయన శోభిత ధూళిపాల గురించి ఆసక్తికరమైన కామెంట్ చేశారు.
తన భార్య శోభితలో తను ఇష్టమైన విషయం గురించి ఓ ఇంటర్వ్యూలో ఆయన చెప్పుకొచ్చారు. ప్రధానంగా నాగచైతన్యకు శోభిత మాట్లాడే స్పష్టమైనతెలుగు తెలుగు భాషా నైపుణ్యాలు అంటే చాలా ఇష్టమట. అంతేకాదు తను చాలా తెలివైందని తన తెలివితేటలను కూడా నేర్పించమని శోభితతో అప్పుడప్పుడు జోక్ చేస్తాడట నాగచైతన్య. అయితే, నాగచైతన్య చదువుకుంది చెన్నైలో తనకు తమిళం బాగా వచ్చు. ఇంట్లోవారితో కూడా ఇంగ్లిష్‌లో మాట్లాడతారట తన తెలుగు అంత స్పష్టంగా ఉండదు అని చెప్పుకొచ్చాడు. అంతేకాదు మామ మా కుటుంబ సభ్యులు కూడా తెలుగులోనే మాట్లాడతారు అన్నారు.
ఇక శోభిత కూడా మొదటిసారి నేను అనుకున్నట్లు కాదు నాగచైతన్య అని చెప్పుకొచ్చింది. చిన్న విషయాలతోనే సంతోషాన్ని వెతుకుతాడు. బైక్ క్లీనింగ్ చేయడానికి కూడా గంటల సమయం కేటాయిస్తారు అని శోభిత చెప్పింది. నాగ చైతన్య, శోభితలు ఓ బాలివుడ్ మూవీ ఈవెంట్లో కలిశారు. అక్కడి నుంచి వారి స్నేహం మొదలైంది. ఆ తర్వాత ప్రేమగా మారింది.
ఇదిలా ఉండగా శోభిత నాగచైతన్యలు గత ఏడాది డిసెంబర్ 4వ తేదీ అన్నపూర్ణ స్టూడియో కొంతమంది కుటుంబ సభ్యుల మధ్య ఘనంగా పెళ్లి జరిగింది. పెళ్లైన వెంటనే శ్రీశైలం దర్శించుకున్నారు. తాజాగా వీరు మెక్సికోలో ఎంజాయ్ చేస్తున్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మొదటి సారి నాగచైతన్యతో 2022లో ముంబైకి బ్రేక్‌ఫాస్ట్ డేటింగ్‌కు వెళ్లారు. అప్పటి నుంచి వీరి మధ్య ఉన్న రిలేషన్ బయటకు వచ్చింది. అంతకు ముందు నాగచైతన్య సమంతను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసింది. కొన్ని వ్యక్తిగత కారణాల మధ్య వారు విడిపోయారు. ఆ తర్వాత నాగచైతన్య శోభితను పెళ్లి చేసుకున్నారు. ఇక సమంత సినిమాల్లో బిజీగా ఉంది.