Naga Chaitanya: కొత్త ఇంట్లో అడుగు పెట్టబోతున్న నాగచైతన్య

Naga Chaitanya: హైదరాబాదులో తన కొత్త ఇంట్లోకి వెళ్ళిపోతున్న నాగచైతన్య

Update: 2023-03-18 16:00 GMT

Naga Chaitanya: కొత్త ఇంట్లో అడుగు పెట్టబోతున్న నాగచైతన్య 

Naga Chaitanya: ఈ మధ్యనే "థాంక్యూ" మరియు "లాల్ సింగ్ చద్దా" సినిమాలతో వరుసగా రెండు డిజాస్టర్లు అందుకున్న యువ హీరో అక్కినేని నాగచైతన్య త్వరలోనే "కస్టడీ" అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ప్రముఖ కోలీవుడ్ డైరెక్టర్ వెంకట్ ప్రభ్ దర్శకత్వంలో తెలుగు తమిళ్ బై లింగువల్ సినిమాగా ఈ చిత్రం త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది. ఈ సినిమాతో నాగచైతన్య కచ్చితంగా మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడు అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఇక వ్యక్తిగత జీవితం గురించి చెప్పుకుంటే అక్కినేని నాగచైతన్య సమంత ని పెళ్లి చేసుకుని హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఒక ఇంట్లో ఉండేవాళ్ళు. కానీ విడాకులు తర్వాత నాగచైతన్య ఆ ఇంటి నుంచి బయటకు వచ్చేశారు. జూబ్లీహిల్స్ లోని తన తండ్రి నాగార్జున ఇంటికి వెళ్లిపోయారు. కొన్నాళ్లు నాగార్జున ఇంట్లో ఉన్న నాగచైతన్య ఆ తరువాత హైదరాబాద్లోనే ఒక పెద్ద సెవెన్ స్టార్ హోటల్లో ఒక సర్వీస్ అపార్ట్మెంట్ లో ఉన్నారు. అయితే తాజాగా ఇప్పుడు నాగచైతన్య కొత్త ఇంటి పనులన్నీ పూర్తయిపోయినట్లు తెలుస్తోంది.

హైదరాబాదులో నాగచైతన్య ఒక ఇంటిని కొనుక్కున్నారట. దీనికి సంబంధించిన పనులన్నీ పూర్తయిపోవడంతో చై తన వస్తువులన్నీ కొత్త ఇంటికి మార్చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే తన దగ్గర కుటుంబ సభ్యులందరికీ గృహప్రవేశం పార్టీ కూడా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమా కాకుండా నాగచైతన్య త్వరలోనే "దూత" అనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తున్నారు. విక్రమ్ కుమార్ ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహిస్తున్నారు.

Tags:    

Similar News