Casting couch: లైంగిక వేధింపుల గురించి మీడియా ముందు మాట్లాడకండి.. నటి కీలక వ్యాఖ్యలు

ఈ కమిటీకి నటి రోహిణిని అధ్యక్షురాలిగా నియమించారు.

Update: 2024-09-09 05:26 GMT

Casting couch: లైంగిక వేధింపుల గురించి మీడియా ముందు మాట్లాడకండి.. నటి కీలక వ్యాఖ్యలు 

జస్టిస్ హేమ కమిటీ విడుదల చేసిన జస్టిస్‌ హేమ కమిటీ సినిమా ఇండస్ట్రీలో ఎలాంటి ప్రకంపనలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మలయాళ చిత్ర పరిశ్రమలో హీరోయిన్లు ఎదుర్కొన్న ఇబ్బందులకు సంబంధించి ఈ కమిటీలో సంచనల విషయాలు వెల్లడయ్యాయి. దీంతో ఇండస్ట్రీకి చెందిన నటులపై ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. ఇప్పటికే కొందరు ఆర్టిస్టులపై కేసులు కూడా నమోదయ్యాయి.

దీంతో తమ ఇండస్ట్రీల్లో కూడా ఇలాంటి కమిటీలు ఏర్పాటు చేయాలని కొందరు డిమాండ్‌ చేస్తున్నారు. ఇప్పటికీ నటి సమంత టాలీవుడ్‌లో ఇలాంటి ఓ కమిటటీని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే కోలీవుడ్‌లో నటీమణులపై వేధింపులు అడ్డుకునేందుకు నడికర్ సంఘం రంగంలోకి దిగింది. సినీ పరిశ్రమలో ఎదురవుతున్న చేదు అనుభవాలు, వేధింపుల గురించి ఫిర్యాదు చేసేందుకు నడికర్‌ సంగం అనే స్టార్‌ సంస్థ ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీకి నటి రోహిణిని అధ్యక్షురాలిగా నియమించారు. ఈ విషయమై నటి రోహిణి మాట్లాడుతూ.. మహిళలు ఫిర్యాదులు చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. లైంగిక వేధింపులకు పాల్పడినట్లు రుజువైతే బాధ్యులపై చర్యలు తీసుకుంటామని రోహిణి హామీ ఇచ్చారు. నేరం రుజువైతే ఐదేళ్లపాటు ఇండస్ట్రీ నుంచి నిషేధిస్తామని తేల్చి చెప్పారు.

అంతేకాకుండా వేధింపులు ఎదుర్కొన్న మహిళలకు అవసరమైన న్యాయ సహాయం కూడా కమిటీ అందిస్తుందని తెలిపారు. అయితే లైంగింక వేధింపులకు గురైన వారు ఆ విషయాలను మీడియా ముందు వెల్లడించొద్దని రోహిణి సూచించారు. ఫిర్యాదులు చేసేందుకు ఇప్పటికే ప్రత్యేక యంత్రాంగాన్ని సిద్ధం చేశామని, ఇందుకోసం ప్రత్యేకంగా ఈ-మెయిల్, ఫోన్ నంబర్‌ను ఏర్పాటు చేసినట్లు రోహిణి తెలిపారు. బాధితులు హోం కమిటీకి ఫిర్యాదు చేయాలని కోరారు. మరి టాలీవుడ్‌లో కూడా ఇలాంటి కమిటీ ఏర్పాటు చేస్తారో లేదో చూడాలి.

Tags:    

Similar News