ప్రముఖ సంగీత ద‌ర్శకుడు రాజన్‌ క‌న్నుమూత‌

Music Director Rajan : గత కొన్ని రోజులుగా భారతీయ సినిమా పరిశ్రమలో వరుసగా విషాద ఛాయలు నెలకొంటున్నాయి. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు రాజన్‌ (87) కన్నుమూశారు.

Update: 2020-10-12 08:55 GMT

Music Director Rajan 

Music Director Rajan : గత కొన్ని రోజులుగా భారతీయ సినిమా పరిశ్రమలో వరుసగా విషాద ఛాయలు నెలకొంటున్నాయి. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు రాజన్‌ (87) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గత రాత్రి బెంగుళూర్ లోని అయన నివాసంలో కన్నుమూశారు. అయన చనిపోయిన విషయాన్ని రాజన్ కుటుంబ సభ్యులు వెల్లడించారు.

ఇక రాజన్‌ సినీ కెరీర్ విషయానికి వచ్చేసరికి తెలుగు, కన్నడ, తమిళ భాషలలో సుమారుగా 37 సంవత్సరాల పాటు సంగీత సేవలను అందించారు. రాజన్ అయన తమ్ముడు నాగేంద్రతో కలిసి స్వరాలను సమకూర్చేవారు. 1952లో విడుదలైన 'సౌభాగ్య లక్ష్మి' సినిమాతో సంగీత దర్శకులుగా రాజన్ కెరీర్‌ ప్రారంభమైంది. ఆ తర్వాత అయన 200కి పైగా సినిమాలకు సంగీతం అందించారు.

ఇక తెలుగులో అయన అగ్గి పిడుగు, పంతుల‌మ్మ, మూడుముళ్లు, పూజ‌, ప్రేమ ఖైదీ, సొమ్మొకడిది సోకొక‌డిది, రెండు రెళ్లు ఆరు, కిలాడీ దొంగ‌లు, నాగ‌మ‌ల్లి, పులి బెబ్బులి మొదలగు సినిమాలకి సంగీతం అందించారు. అయన మరణవార్త వినగానే ఇండస్ట్రీలోని ప్రముఖులు షాక్ కి గురయ్యారు.. అయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకున్నారు.

Tags:    

Similar News