Aryan Khan: బాంబే హైకోర్టు బెయిల్‌ ఇచ్చినా విడుదల అవ్వని అర్యన్‌ఖాన్

* నేడు అర్యన్‌ఖాన్ విడుదలయ్యే అవకాశాలు * 14 షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు * ఆర్యన్‌కు పూచీకత్తు ఇచ్చిన నటి జుహీచావ్లా

Update: 2021-10-30 01:45 GMT

ఆర్యన్ ఖాన్ (ఫైల్ ఫోటో)

Aryan Khan: బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ఖాన్‌కు బాంబే హైకోర్టు బెయిలిచ్చినా జైల్‌లోనే ఉండాల్సి వస్తోంది. నౌకలో డ్రగ్స్‌ పార్టీ కేసులో అరెస్టైన ఆర్యన్‌, అతని సహ నిందితులు ఆర్బాజ్‌ మర్చంట్‌, మున్‌మున్‌ ధామేచాకు బెయిల్‌ మంజూరు చేస్తామని బాంబే హైకోర్టు బెయిల్‌ ఇస్తామని ప్రకటించింది. ఇందుకోసం ఐదు పేజీలతో కూడిన ఆర్డర్లను జారీ చేశారు.

అయితే బెయిల్‌ కోసం 14 షరతులను విధించారు. ఆర్యన్‌ఖాన్‌ రూ. లక్ష విలువైన వ్యక్తిగత బాండ్‌ను చెల్లించాలి. ట్రయల్‌ కోర్టులో పాస్‌పోర్టును సరెండర్‌ చేయాలి. ఒకరు లేదా ఇద్దరి పూచీకత్తు తప్పనిసరి. ప్రతి శుక్రవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య ముంబై ఎన్‌సీబీ అధికారుల ముందు హాజరవ్వాలి.

దర్యాప్తు అధికారికి సమాచారం ఇవ్వకుండా ముంబై విడిచి వెళ్ల కూడదు. దర్యాప్తు అధికారులు ఎప్పుడు పిలిచినా విచారణకు వెళ్లాలి. తోటి నిందితులను కలవొద్దు వారితో మాట్లాడొద్దు. సాక్షులను ప్రభావితం చేసే ప్రయత్నాలు చేయొద్దు. ఈ కేసుపై మీడియాతో ఎట్టి పరిస్థితుల్లోనూ మాట్లాడకూడదు.

కోల్‌కతా నైట్‌రైడర్స్‌లో షారూఖ్‌ భాగస్వామి, నటి జుహీచావ్లా ఆర్యన్‌కు పూచీకత్తు ఇచ్చారు. బెయిల్‌ లాంఛనాలను ట్రయల్‌ కోర్టు లో ముగించగానే షారూఖ్‌ఖాన్‌, న్యాయవాదులు ఆర్థర్‌రోడ్‌ జైలుకు చేరుకున్నారు. ఆర్యన్‌ విడుదల కోసం షారూఖ్‌ ఉద్వేగంగా ఎదురుచూశారు.

అయితే సాయంత్రం 5.30 వరకు కూడా బెయిల్‌ ఆర్డర్లు జైలుకు చేరలేదు. దీంతో శుక్రవారం విడుదల అసాధ్యంగా మారింది. నిబంధనల ప్రకారం సాయంత్రం 5.30 తర్వాత బెయిల్‌ ఆర్డర్లు వస్తే, తర్వాతి రోజే విడుదల ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆర్యన్‌ మరో రాత్రి జైలులోనే ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. ఇక ఈరోజు ఆర్యన్‌ విడుదలయ్యే అవకాశాలున్నాయి.

Tags:    

Similar News