HIT: ముగ్గురు హీరోలతో హిట్ 3..?

HIT: ముగ్గురు హీరోలతో హిట్ 3..?

Update: 2022-11-22 08:56 GMT

HIT: ముగ్గురు హీరోలతో హిట్ 3..?

HIT: యువ హీరో విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ కొలను దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకి వచ్చిన "హిట్: ది ఫస్ట్ కేస్" సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. న్యాచురల్ స్టార్ నాని నిర్మించిన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. తాజాగా ఈ సినిమాకి సీక్వెల్ గా "హిట్: ది సెకండ్ కేసు" అనే సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకి రాబోతోంది.

అడవి శేష్ హీరోగా నటించిన ఈ సినిమా డిసెంబర్ రెండవ తేదీన థియేటర్లలో విడుదల కి సిద్ధమవుతోంది. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో రావు రమేష్, తనికెళ్ల భరణి, పోసాని కృష్ణ మురళి, తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. అయితే హిట్ ఫ్రాంచైజ్ తో హిట్ యూనివర్స్ సృష్టిస్తానని అందులో విభిన్న హీరోలు ఉంటారని శైలేష్ కొలను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా హిట్ 3 సినిమాకి సంబంధించిన ఒక ఆసక్తికరమైన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

హిట్ 2 సినిమా విడుదలైన తర్వాత చిత్ర దర్శక నిర్మాతలు సినిమాకి సీక్వెల్ అయిన హిట్ 3 పైన దృష్టి పెట్టబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. హిట్ 2 లో నటించిన అడివి శేష్ హిట్ 3 లో కూడా హీరోగా కనిపించబోతున్నారని సమాచారం. అయితే ఇప్పటిదాకా నిర్మాతగా మాత్రమే హిట్ ఫ్రాంచెస్ లో భాగమైన నాని హిట్ 3 లో నటించనున్నారని కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అంతే కాకుండా తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి కూడా హిట్ 3 లో ఒక కీలక పాత్రలో కనిపించబోతున్నారని తెలుస్తోంది. టైటిల్ కి తగ్గట్టుగానే హిట్ 3 లో ముగ్గురు హీరోలు ఉండబోతున్నారని సమాచారం. ఇక సినిమా మొత్తం అమెరికా బ్యాక్ డ్రాప్ లో సాగుతుందని తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడనుంది.

Tags:    

Similar News