ఈ ఏడాది ఎక్కువ మంది చూసిన వెబ్ సిరీస్ ఇదే.. కామెడీ నుంచి థ్రిల్లర్ వరకు టాప్ 10లోని సిరీస్ లిస్ట్ ఇదిగో!

2025లో OTTలో అత్యధికంగా వీక్షించిన Top 10 Web Series లిస్ట్ వచ్చేసింది. Panchayat, Paatal Lok, Squid Game, Aashram, Criminal Justice వంటి సిరీస్‌లు ఎంత వ్యూస్ సాధించాయో తెలుసుకోండి.

Update: 2025-08-20 09:35 GMT

Most Watched Web Series of the Year: From Comedy to Thriller, Here’s the Top 10 List!

OTT ప్లాట్‌ఫార్మ్స్ లో ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో అత్యధికంగా వీక్షించిన Top 10 Web Series లిస్ట్ బయటకు వచ్చింది. జనవరి నుంచి జూన్ 2024 వరకు వచ్చిన రిపోర్ట్ కార్డ్ ప్రకారం, కొన్ని సిరీస్‌లు రికార్డులను బద్దలుకొట్టి అగ్రస్థానాలు దక్కించుకున్నాయి. ముఖ్యంగా కొత్తగా వచ్చిన ఒక వెబ్ సిరీస్ రెండు నెలల్లోనే Panchayat, Paatal Lok వంటి సూపర్ హిట్స్‌ను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలవడం విశేషం.

OTTలో టాప్ 10 వెబ్ సిరీస్ (2024 జనవరి – జూన్)

1. జువెల్ థీఫ్ (Netflix)

సైఫ్ అలీ ఖాన్, జైదీప్ అహ్లావత్ నటించిన ఈ సిరీస్ 13.1 మిలియన్ల మంది చూశారు.

2. చిడియా ఉడ్ (Amazon MX Player)

జాకీ ష్రాఫ్ నటించిన ఈ సిరీస్‌ను 13.7 మిలియన్ల మంది వీక్షించారు.

3. ది సీక్రెట్ ఆఫ్ ది షీలేదార్స్ (Disney+ Hotstar)

రాజీవ్ ఖండేల్వాల్ ప్రధాన పాత్ర పోషించిన ఈ థ్రిల్లర్‌ను 14.5 మిలియన్ల మంది చూశారు.

4. ది రాయల్స్ (Netflix)

ఇషాన్ ఖట్టర్, భూమి పెడ్నేకర్ జంటగా నటించిన ఈ రొమాంటిక్ డ్రామా 15.5 మిలియన్ల వ్యూస్ సాధించింది.

5. ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 6 (Disney+ Hotstar)

మిథాలజికల్ యానిమేషన్ సిరీస్‌ను 16.2 మిలియన్ల మంది వీక్షించారు.

6. స్క్విడ్ గేమ్ సీజన్ 3 (Netflix)

కొరియన్ సూపర్ హిట్ సిరీస్ కొత్త సీజన్ 16.5 మిలియన్ల వ్యూస్ అందుకుంది.

7. పాతాళ్ లోక్ సీజన్ 2 (Amazon Prime Video)

జైదీప్ అహ్లావత్ హాథీ సింగ్ చౌదరి పాత్రలో ఆకట్టుకొని, 16.8 మిలియన్ల వ్యూస్ సాధించింది.

8. పంచాయత్ సీజన్ 4 (Amazon Prime Video)

ప్రేక్షకులు ఎంతో ఇష్టపడే ఈ కామెడీ డ్రామా 23.8 మిలియన్ల మంది చూశారు.

9. ఏక్ బద్నామ్ ఆశ్రమ్ సీజన్ 3 పార్ట్ 2 (Amazon MX Player)

బాబీ డియోల్ నటించిన ఈ సిరీస్ 27.1 మిలియన్ల వ్యూస్ సాధించింది.

10. క్రిమినల్ జస్టిస్: ఎ ఫ్యామిలీ మేటర్ (Disney+ Hotstar)

పంకజ్ త్రిపాఠి నటించిన ఈ సిరీస్ 77 మిలియన్ల వ్యూస్ సాధించి, అన్ని రికార్డులను బద్దలుకొట్టి టాప్‌లో నిలిచింది.

Tags:    

Similar News