Chiru - Meher Ramesh: చిరుతో షూటింగ్ మొదలుపెట్టనున్న మెహర్ రమేష్

* తమిళంలో సూపర్ హిట్ అయిన వేదాళం సినిమాకి రీమేక్ గా తెరకెక్కనుంది * ఈ సినిమాకి "భోళా శంకర్" అనే టైటిల్ ని ఖరారు చేశారు

Update: 2021-09-29 14:30 GMT

చిరంజీవి- మెహర్ రమేష్(ఫోటో- ది హన్స్ ఇండియా)

Chiru - Meher Ramesh: ఫ్లాప్ డైరెక్టర్ మెహర్ రమేష్ "శక్తి", "షాడో" వంటి వరుస డిజాస్టర్ లను అందుకున్న తరువాత కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకు దూరంగా ఉన్నారు. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు మెహర్ రమేష్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఒక సినిమా చేయబోతున్నారు. తమిళంలో సూపర్ హిట్ అయిన ''వేదాళం'' సినిమాకి రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కనుంది.

ఈ సినిమాలో కీర్తి సురేష్ చిరంజీవి పాత్రలో కనిపించబోతున్నారు. ప్రస్తుతం మెగాస్టార్ "లూసిఫర్" సినిమా రీమేక్ అయిన "గాడ్ ఫాదర్" షూటింగ్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాత మెహర్ రమేష్ సినిమా షూటింగ్ మొదలు పెట్టాలనుకున్నారు మెగాస్టార్.

అయితే తాజా సమాచారం ప్రకారం ఊటీ షూట్ పూర్తిచేసిన తరువాత "గాడ్ ఫాదర్" చిత్రబృందం తదుపరి షెడ్యూల్ కోసం మంచి లొకేషన్లను వెతకడానికి కొంచెం గ్యాప్ తీసుకోబోతుందట.

చిత్ర బృందం ఇంకా లొకేషన్ల వేటలోనే ఉంది. కానీ మరోవైపు మెహర్ రమేష్ తన సినిమా కోసం లొకేషన్ లను ఆల్రెడీ వెతుక్కొని ఉంచుకున్నారు.

కాబట్టి "గాడ్ ఫాదర్" షెడ్యూల్ మధ్య దొరికిన గ్యాప్ లో మెహర్ రమేష్ సినిమా షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు అని సమాచారం. మెగాస్టార్ చిరంజీవి సినిమాకి మెహర్ రమేష్ చాలా ప్రిపేర్డ్ గా ఉన్నారని షూటింగ్ ఇప్పుడు మొదలు పెట్టడం కూడా మంచిదేనని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ సినిమాకి "భోళా శంకర్" అనే టైటిల్ ని ఖరారు చేశారు దర్శక నిర్మాతలు.

Tags:    

Similar News