Arjun Chakravarthy Movie: "అర్జున్ చక్రవర్తి నుండి తొలి సింగిల్ ‘మెఘం వర్షించదా’ విడుదల
Arjun Chakravarthy Movie: విజయ రామరాజు టైటిల్ రోల్‌లో నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది.
Arjun Chakravarthy Movie: విజయ రామరాజు టైటిల్ రోల్‌లో నటించిన స్పోర్ట్స్ డ్రామా ‘అర్జున్ చక్రవర్తి’ ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది. విక్రాంత్ రుద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాను శ్రీని గుబ్బల నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి 46 అంతర్జాతీయ అవార్డులు రావడం విశేషం.
ఇటీవల విడుదలైన టీజర్‌కు సోషల్ మీడియా లో అద్భుతమైన స్పందన వచ్చింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 16 మిలియన్ల వ్యూస్, యూట్యూబ్‌లో 1.5 మిలియన్లు దాటిన ఈ టీజర్ సినిమాపై భారీ అంచనాలను నెలకొల్పింది.
ఇప్పుడు మేకర్స్ ఫస్ట్ సింగిల్ "మేఘం వర్షించదా" రిలీజ్ చేసి మ్యూజికల్ ప్రమోషన్స్‌కి శ్రీకారం చుట్టారు. సంగీత దర్శకుడు విఘ్నేష్ బాస్కరన్ ఈ పాటను హృద్యమైన లవ్ ట్రాక్‌గా కంపోజ్ చేశారు. దర్శకుడు విక్రాంత్ రుద్ర స్వయంగా రాసిన లిరిక్స్ హృదయాన్ని తాకేలా ఉన్నాయి.
కపిల్ కపిలన్, మీరా ప్రకాష్, సుజిత్ శ్రీధర్ తమ మెలోడియస్ వాయిస్‌లతో ఈ పాటను మరింత భావోద్వేగంగా తీర్చిదిద్దారు. ఈ పాటలో విజయ రామరాజు – సిజా రోజ్ జంట మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ సినిమాకు ఉండబోయే మ్యూజికల్ యాంగిల్‌కు ట్రెండీ టచ్ ఇస్తోంది.
ఈ చిత్రంలో హర్ష్ రోషన్, అజయ్, అజయ్ ఘోష్, దయానంద్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. సినిమాకు జగదీష్ చీకాటి డీవోపీ, ప్రదీప్ నందన్ ఎడిటింగ్, సుమిత్ పటేల్ ప్రొడక్షన్ డిజైన్ చేస్తున్నారు. ఇప్పటికే మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ‘అర్జున్ చక్రవర్తి’ త్వరలోనే థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది.