ఏపీలో సినిమా టిక్కెట్ ధరలు పెంచండి.. జగన్ ప్రభుత్వానికి చిరంజీవి విజ్ఞప్తి
Megastar Chiranjeevi: ఏపీలో ఆన్‌లైన్ టికెటింగ్ బిల్లును స్వాగతించారు మోగాస్టార్ చిరంజీవి.
ఏపీలో సినిమా టిక్కెట్ ధరలు పెంచండి.. జగన్ ప్రభుత్వానికి చిరంజీవి విజ్ఞప్తి
Megastar Chiranjeevi: ఏపీలో ఆన్‌లైన్ టికెటింగ్ బిల్లును స్వాగతించారు మోగాస్టార్ చిరంజీవి. ఆన్‌లైన్ టికెటింగ్ బిల్ హర్షించదగ్గదని చెప్పారు. అయితే సినిమా టికెట్ల ధర విషయంలో పునరాలోచించాలని మెగాస్టార్ చిరంజీవి ఏపీ సీఎం జగన్‌కు కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు.
'పరిశ్రమ కోరిన విధంగా పారదర్శకత కోసం ఆన్‌లైన్ టిక్కెటింగ్ బిల్ ప్రవేశ పెట్టడం హర్షించదగ్గ విషయం. అదేవిధంగా థియేటర్ల మనుగడ, సినిమానే ఆధారంగా చేసుకున్న ఎన్నో కుటుంబాల బతుకు తెరువు కోసం తగ్గించిన టికెట్ ధరలను కాలానుగుణంగా, సముచితంగా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న విధంగా నిర్ణయిస్తే పరిశ్రమకు మేలు జరుగుతుంది. దేశమంతా ఒకటే జీఎస్టీగా పన్నులు ప్రభుత్వాలు తీసుకుంటున్నప్పుడు టికెట్ ధరలలో కూడా అదే వెసులుబాటు ఉండటం సమంజసం. దయచేసి ఈ విషయంపై పునరాలోచించండి. ఆ ప్రోత్సాహం ఉన్నప్పుడే తెలుగు పరిశ్రమ నిలదొక్కుకోగలుగుతుంది' అని చిరంజీవి ట్వీట్ చేశారు.